తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచకు చెందిన నరేష్ అనే వ్యక్తిపై కొందరు యువకులు పిడుగుద్దులతో విచక్షణారహితంగా దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నరేష్ గురువారం పాల్వంచ దమ్మపేట సెంటర్కు చేరుకోగానే కొందరు మాటు వేసి దాడి చేసినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ హుస్సేన్ వారిని అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కానిస్టేబుల్ లేకుంటే ప్రాణాలు కోల్పోయేవాడని చెబుతున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ