Monday, 03 August 2026 03:56:07 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

భూ సర్వేకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 22 July 2026 05:56 PM Views : 50

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలంలో సీతారామ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూ సర్వే పనుల పరిశీలన పడమటి నరసాపురం గిరిజన బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు సంబంధించిన భూ సేకరణ సర్వే పనులను ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులో ముగించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, మెరుగైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం జూలూరుపాడు మండలంలో జరుగుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు సంబంధించిన భూ సేకరణ సర్వే పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పురోగతిపై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, సర్వేలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూలూరుపాడు గ్రామ పరిధిలో మొత్తం 17 ఎకరాల 20 కుంటల భూమికి సర్వే చేపట్టాల్సి ఉందని, అందులో సుమారు 8 ఎకరాలు ఆర్‌ఓఎఫ్‌ఆర్ (ROFR) పట్టా భూములు ఉన్నాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కొత్తూరు గ్రామంలో కొనసాగుతున్న భూ సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్, మొత్తం 337 ఎకరాల భూమికి సర్వే చేపట్టాల్సి ఉందని తెలుసుకుని, పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూ సర్వే ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రతి దశను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సర్వేకు అవసరమైన మార్కింగ్ పనులను ఒక రోజులో పూర్తి చేసి తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ వెడల్పును 50 మీటర్ల నుంచి 40 మీటర్లకు తగ్గించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ప్రాజెక్టు డిజైన్‌ను సాంకేతికంగా పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం గ్రామంలోని గిరిజన బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వంటశాల, విద్యార్థుల వసతి గదులు, పారిశుధ్య నిర్వహణను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై సమగ్రంగా ఆరా తీశారు. విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉంచిన ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించిన కలెక్టర్, కిచెన్ షెడ్‌లో పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్, ఉదయం అల్పాహారం, మెనూ ప్రకారం భోజనం అందుతున్న విధానం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత విద్యా సంవత్సరంలో పాఠశాలలో పదో తరగతి ఫలితాలు వంద శాతం నమోదయ్యాయని ఉపాధ్యాయులు కలెక్టర్‌కు వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా వంద శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పాఠశాలల్లో పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం, మెరుగైన విద్యా వాతావరణం, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉండేలా అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని బాధ్యతగా తీసుకుని, లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీనివాస్, ఇరిగేషన్ శాఖ అధికారులు, సర్వే అధికారులు, రైతులు, ఉపాధ్యాయులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :