Friday, 18 September 2026 08:22:17 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 16 March 2026 04:40 PM Views : 242

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించే విధంగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్డీవో మధు, గృహ నిర్మాణ శాఖాధికారి రవీంద్రనాథ్ లతో కలిసి కలెక్టర్ ప్రజల వినతిపత్రాలను స్వయంగా స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించగా, వాటిని శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి తక్షణ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై శాఖాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులో చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సమర్థవంతమైన పరిపాలన అందించడంలో అధికారులు కట్టుబడి ఉండాలని తెలిపారు.

ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని దరఖాస్తులు : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సాంబ పూర్ణచంద్రరావు (తండ్రి: వెంకటేశ్వర్లు) తమకు కొత్తగూడెం పట్టణ పరిధిలోని గాజులరాజా బస్తీ, విశ్వనాథ కాలనీ, హౌస్ నం.169/A వద్ద 0.22 కుంటల పట్టా భూమి ఉందని తెలిపారు. ఆ భూమిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి గృహ నిర్మాణం చేపడుతున్నారని, కావున తగిన చర్యలు తీసుకొని తమ భూమిని తిరిగి తమకు అప్పగించాలంటూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు ఎండార్స్ చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని సాయినగర్ కాలనీకి చెందిన ప్రజలు తమ కాలనీ సుమారు 35 సంవత్సరాల క్రితం ఏర్పడినప్పటి నుండి సీసీ రోడ్డు నిర్మాణం కోసం అనేకసార్లు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు రోడ్డు నిర్మాణం జరగలేదని తెలిపారు. 2019లో రూ.20 లక్షలు మంజూరైనట్లు చెప్పినప్పటికీ డ్రైనేజీ మరియు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని పేర్కొంటూ వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని చేసిన దరఖాస్తును తగు చర్యల నిమిత్తం లక్ష్మీదేవిపల్లి ఎంపీడీవోకు ఎండార్స్ చేశారు. టేకులపల్లి మండలం రాజాపురం గ్రామానికి చెందిన అశోక్ తమ గ్రామంలో సుమారు 10 సంవత్సరాల క్రితం మిషన్ భగీరథ ట్యాంక్ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు సక్రమంగా నీటి సరఫరా జరగలేదని తెలిపారు. గ్రామంలో ఉన్న రెండు బోర్లు కూడా ప్రస్తుతం పనిచేయడం లేదని పేర్కొంటూ వేసవి కాలంలో త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు మిషన్ భగీరథ నీటి సరఫరా పునరుద్ధరించడంతో పాటు బోర్లను మరమ్మతు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం మిషన్ భగీరథ అధికారులకు ఎండార్స్ చేశారు. మణుగూరు మండలం విట్టల్‌రావు నగర్‌కు చెందిన రావుల రాములు (తండ్రి: లేటు నారాయణ) తమకు తిర్లాపురం గ్రామం సర్వే నం.16/23/Aలో ఐదు ఎకరాల భూమి ఉందని తెలిపారు. తమ తండ్రి మరణానంతరం కుటుంబ సభ్యులు ఆ భూమిని తమ పేర్లతో సర్వే చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ వివాదంలో ఉన్న భూమిపై సర్వే ప్రక్రియతో పాటు భూమి పరిహారం చెల్లింపులు తాత్కాలికంగా నిలిపివేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం భూసేకరణ అధికారులకు ఎండార్స్ చేశారు. ములకలపల్లి మండలం మాదారం గ్రామపంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న ఉకంటి రవికుమార్ (తండ్రి: వెంకట్రావు) గత రెండు సంవత్సరాలుగా గ్రామపంచాయతీలో పాలకవర్గాలు లేని సమయంలో నిర్వహించిన ఖర్చులు మరియు అప్పుల వివరాలను గ్రామపంచాయతీ నోటీస్ బోర్డులో ప్రజలకు తెలియజేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం జిల్లా పంచాయతీ అధికారికి ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :