Wednesday, 16 September 2026 07:38:21 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

బ్యాంకర్లు, స్వయం సహాయక సంఘాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన

Date : 14 August 2026 06:21 PM Views : 59

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్వయం సహాయక సంఘాల ఎన్‌పీఏ రుణ ఖాతాలను తగ్గించాలి శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలు, బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన బ్యాంకు రుణాలు, రుణ బకాయిలు, ఎన్‌పీఏ ఖాతాలపై మండలాలు, సంఘాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వై.ఎన్. రెడ్డి జిల్లాలోని అన్ని బ్యాంకు శాఖల్లో స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన బ్యాంకు రుణాల ఎన్‌పీఏ ఖాతాల వివరాలను సమీక్షించారు. మండలాల వారీగా, సంఘాల వారీగా ఎన్‌పీఏ పరిస్థితిని పరిశీలించి, ఎన్‌పీఏను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీఎంలు, బ్యాంకు శాఖల నిర్వాహకులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన మాట్లాడుతూ, ఏపీఎంలు, బ్యాంకు శాఖల నిర్వాహకులు సమన్వయంతో పనిచేసి స్వయం సహాయక సంఘాల ఎన్‌పీఏను తగ్గించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. మండలాలు, సంఘాల వారీగా రుణ ఖాతాలను పరిశీలించి, బకాయిల వసూళ్లకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఎన్‌పీఏను పూర్తిస్థాయిలో తగ్గించేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించేలా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలని, రుణాల చెల్లింపులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రుణ బకాయిలు ఉన్న సంఘాలను గుర్తించి, ఆయా సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడి రుణాల చెల్లింపునకు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. అవసరమైన చోట బ్యాంకర్లు, ఏపీఎంలు కలిసి సంఘాల సభ్యులకు రుణ చెల్లింపుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడంలో బ్యాంకు రుణాల సకాలంలో చెల్లింపు కీలకమని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. సంఘాలు రుణాలను సక్రమంగా వినియోగించుకొని, నిర్ణీత కాల వ్యవధిలో వాయిదాలను చెల్లించేలా ప్రోత్సహించాలని అన్నారు. ఎన్‌పీఏ తగ్గింపుతో పాటు భవిష్యత్తులో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు సులభంగా అందేలా నమ్మకాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. బ్యాంకర్లు, స్వయం సహాయక సంఘాల సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని, ప్రతి మండలంలో ఎన్‌పీఏ తగ్గింపుపై నిరంతరం సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎల్‌డీఎం రామిరెడ్డి, పీఎం (బీఎల్) వీరమల్లు, పీఈ (బీఎల్) వెంకట్, అదనపు డీఆర్‌డీఓ నీలేష్, డీపీఎంలు, ఏపీఎం (బీఎల్), అన్ని బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :