తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత పర్యటన చేశారు ముందుగా దమ్మపేట మండలం గండుగులపల్లి రైతువేదికలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమాలలో భాగంగా వ్యవసాయ విధ్యుత్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు అనంతరం అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల ఒకటవ తారీకు నుంచి ఆరవ తారీకు వరకు అత్యంత వైభవంగా నిర్వహించిన మహా కుంభాభిషేకం విజయవంతం అవ్వటానికి ముఖ్యపాత్ర పోషించిన గ్రామపంచాయతీ కార్మికులను మండల అధికారులను ప్రత్యేకంగా సన్మానించారు పర్యటనలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా పలు శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ