Wednesday, 16 September 2026 10:12:11 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

కన్న తల్లి నే హత్య చేసిన కూతురు...

Date : 24 June 2025 05:36 PM Views : 967

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : హైదరాబాద్‌ నగరంలోని జీడిమెట్లలో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న బాలిక ప్రియుడితో కలిసి కన్నతల్లిని చంపేసింది....!! మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమ వ్యవహారం తెలిసి తల్లి మందలించిందన్న కోపంతో తన ప్రియుడు, అతని తమ్ముడుతో కలిసి కూతురు కన్నతల్లినే చంపేసింది.. జీడిమెట్లలోని ఎన్‌ఎల్‌బీ నగర్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. 10వ తరగతి చదువుతున్న తేజశ్రీకి.. నల్లగొండకు చెందిన పగిల్ల శివ (19) అనే యువకుడితో 8 నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసుకుంది. డీజే ప్లేయర్ అయిన శివ – తేజశ్రీ ఫోన్లు, మెసేజ్‌లతో ప్రేమలో మునిగిపోయారు. అయితే.. వీరిద్దరి ప్రేమ వ్యవహారం తల్లికి తెలిసింది.ఈ వయసులో ఇది సరైన పద్ధతి కాదని… బాగా చదువుకోవాలని కూతురిని మందలించింది.తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని డిసైడ్ అయింది. ఈ విషయాన్ని ప్రియుడు శివకు చెప్పింది. ఇద్దరూ కలిసి హత్యకు స్కెచ్ వేశారు. అందుకు శివ తన తమ్ముడు పగిల్లా యశ్వంత్(18) సహాయం తీసుకున్నాడు.ఈ క్రమంలో శివ, యశ్వంత్ ఇంటికి రాగా.. తేజశ్రీ కలిసి ముగ్గురూ కలిసి ఒంటరిగా ఉన్న తల్లిని కిరాతకంగా చంపేసారు. స్థానికుల ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే.. ఐదు రోజుల క్రితం తేజశ్రీ ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది.ఈ క్రమంలోనే.. మైనర్ బాలికతో పాటు ఇద్దరు అబ్బాయిలు నిన్న సాయంత్రం ఇంటికి వచ్చి చున్నీతో ఉరివేసి తలపై బాది అంజలిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. *చంపిన చున్నీని నిందితుడు నడుముకి కట్టుకొని పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తేజశ్రీ తల్లి.. అంజలి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు.. అంజలి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఫోక్ సింగర్‌ గా ఉన్నారు. తొర్రూరు దగ్గర ఇనుగుర్తి స్వగ్రామం. కూతురే తల్లిని ఇలా దారుణంగా చంపేయడంతో ఆ కళాబృందంలో సభ్యులంతా ఇప్పుడు షాక్‌లో ఉన్నారు. షాకింగ్ విషయాలు.....అంజలి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఐదు రోజుల క్రితం తేజశ్రీ ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని.. ఈ విషయం గురించి పోలీసులకి ఫిర్యాదు కూడా చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో చిన్న కూతురు లేని సమయంలో పెద్ద కూతురు ప్రియుడుతో కలిసి హత్య చేసినట్లు తెలిపారు. చిన్న కూతురు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం తమకు తెలిసినట్లు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :