Wednesday, 04 November 2026 05:00:28 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా నరాటి ఎన్నిక. కార్యవర్గ సభ్యులుగా జమలయ్య, నగేష్ ఏకగ్రీవం.

Date : 09 September 2026 08:51 PM Views : 195

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా నరాటి ఎన్నిక.కార్యవర్గ సభ్యులుగా జమలయ్య, నగేష్ ఏకగ్రీవం.మరో 13మందికి రాష్ట్ర సమితిలో జిల్లా నుంచి చోటు. కార్మికవర్గ పోరాటాలను ఉధృతం చేస్తాం : నరాటి ప్రసాద్ .కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో రాజీలేని పోరాటాలు నిర్మిస్తామని ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ స్పష్టం చేసింది. కరీంనగర్‌లో ఈ నెల 6, 7, 8 తేదీల్లో విజయవంతంగా ముగిసిన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల్లో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఏకంగా 16 మంది కార్మిక నాయకులకు రాష్ట్రస్థాయిలో ప్రాతినిధ్యం దక్కింది. రాష్ట్ర కార్యదర్శిగా నరాటి ప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా కంచెర్ల జమలయ్య, జి. నాగేష్, రాష్ట్ర సమితి సభ్యులుగా కె. సారయ్య, రాము, జి. వీరాస్వామి, వంగా వెంకట్, వేల్పుల మల్లికార్జున్, దేవరకొండ శంకర్, అన్నారపు వెంకటేశ్వర్లు, గోనే మణి, ఎం.డి. నజీర్ అహ్మద్, భూక్యా శ్రీనివాస్, జక్కుల రాములు, కోరే కృష్ణ, మండల రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. జిల్లా నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులకు కీలక స్థానాలు లభించడం పట్ల జిల్లా నాయకత్వం హర్షం వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలిపింది. ఈ సందర్బంగా బుధవారం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల ఉద్యోగ, సామాజిక భద్రతపై పాలకులు చేస్తున్న దాడిని తిప్పికొడుతూ కార్మిక లోకాన్ని ఏకం చేసి ఉద్యమిస్తామని, జిల్లా నాయకులకు సముచిత స్థానం దక్కేలా తోడ్పాటునందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్.కె. సాబీర్ పాషాలకు కౌన్సిల్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :