Thursday, 17 September 2026 06:47:27 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ను అత్యంత ప్రామాణికంగా రూపొందించాలి : జనగణన సంచాలకులు భారతి హోళీ కేరి

Date : 07 August 2026 03:55 PM Views : 130

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డేటా నాణ్యత, ఖచ్చితత్వం, ఏకరూపతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి నిర్ణీత గడువులోపు ధృవీకరించిన జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ను రాష్ట్ర కార్యాలయానికి పంపాలి జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ (డీసీహెచ్‌బీ)ను అత్యంత ప్రామాణికంగా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించాలని జనగణన సంచాలకులు (డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్) భారతి హోళీ కేరి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం ఐడీఓసీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనగణన సంచాలకులు భారతి హోళీ కేరి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రతి జిల్లాకు ప్రత్యేక జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపొందిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లకు ప్రత్యేక హ్యాండ్‌బుక్‌లు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌లో జనాభా, సామాజిక, ఆర్థిక, పరిపాలనా, మౌలిక వసతులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందుపరుస్తామని తెలిపారు. భవిష్యత్ ప్రభుత్వ విధానాల రూపకల్పన, అభివృద్ధి ప్రణాళికలు, పరిశోధనలు, జనగణన విశ్లేషణలకు ఈ హ్యాండ్‌బుక్ ప్రామాణిక ఆధార పత్రంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రతి శాఖ నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించి, రెవెన్యూ గ్రామం, పట్టణ స్థాయి వరకు పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. 2025 డిసెంబర్ 31 నాటికి అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, సౌకర్యాలు, శాఖల అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. గృహాల జాబితా సేకరణ అనంతరం జనాభా గణాంకాలను జాతీయ స్థాయిలో విశ్లేషించి అధికారికంగా ప్రచురిస్తారని తెలిపారు. జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌లో పొందుపరిచే ప్రతి సమాచారం సంబంధిత శాఖల అధికారిక నమోదుల ఆధారంగా మాత్రమే ఉండాలని, సమాచారం సంపూర్ణంగా, ఖచ్చితంగా, ఏకరూపంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆగస్టు 10 నుంచి 21 వరకు సమాచార సేకరణ చేపట్టాలని, జిల్లా స్థాయిలో నోడల్ అధికారి ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రతి శాఖకు బాధ్యతలు కేటాయించాలని ఆదేశించారు. శాఖల వారీగా నోడల్ అధికారులను నియమించి, అవసరమైన నమూనా పట్టికలను ముందుగానే అందించాలని సూచించారు. అన్ని శాఖలు ఒకే నిర్ధారిత తేదీని ప్రామాణికంగా తీసుకొని సమాచారాన్ని అందించాలని, అధికారికంగా ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే ఉపయోగించాలని, అన్ని శాఖల్లో గణాంకాల ఏకరూపత పాటించాలని ఆదేశించారు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 8 వరకు సమాచార నమోదు, పరస్పర పరిశీలన చేపట్టాలని సూచించారు. ప్రతి పట్టికను సంబంధిత శాఖాధికారి, జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ విభాగం రెండుసార్లు పరిశీలించాలని తెలిపారు. ప్రతికూల విలువలు, ఖాళీ గడులు, పునరావృత నమోదులు లేకుండా చూసి, మొత్తాలు, ఉపమొత్తాలు సరిగా ఉన్నాయో లేదో ధృవీకరించాలని సూచించారు. గత జనగణన గణాంకాలు, ప్రస్తుత శాఖల సమాచారాన్ని పోల్చి అసాధారణ వ్యత్యాసాలు ఉంటే వాటికి కారణాలు నమోదు చేయాలని తెలిపారు. నిర్దేశించిన నమూనా పట్టికలను మాత్రమే ఉపయోగించాలని, టైపింగ్ పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని, పదాల అక్షరక్రమంలో ఏకరూపత పాటించాలని సూచించారు. గ్రామాల పేర్లు అధికారిక రెవెన్యూ నమోదుల ప్రకారమే నమోదు చేయాలని, సంకేత సంఖ్యల్లో ఎలాంటి మార్పులు చేయరాదని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 8లోపు జిల్లా సమగ్ర పరిచయాన్ని సిద్ధం చేయాలని తెలిపారు. ఇందులో జిల్లా పరిచయం, భౌగోళిక స్వరూపం, పరిపాలనా నిర్మాణం, ఆర్థిక కార్యకలాపాలు, సామాజిక పరిస్థితులు, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, అభివృద్ధి సూచికలు, జిల్లాకు సంబంధించిన ప్రత్యేక విశేషాలను పొందుపరచాలని సూచించారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు సమాచార ధృవీకరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రతి పట్టికలో అన్ని గడులు పూర్తిగా నింపబడ్డాయా, మొత్తాలు సరిగా ఉన్నాయా, శాఖల మధ్య గణాంకాల్లో వ్యత్యాసాలున్నాయా, వివరణాత్మక సమాచారం గణాంకాలకు అనుగుణంగా ఉందా, తేదీలు సక్రమంగా నమోదయ్యాయా, అధికారిక ఉత్తర్వుల ఆధారంగానే వివరాలు నమోదు చేశారా, పటాల అనుసంధానం సక్రమంగా ఉందా అనే అంశాలను బాధ్యతాధికారులు తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు. ప్రతి సమాచారం ప్రామాణికత, ఖచ్చితత్వం, తాజాదనం, సంపూర్ణత, ఏకరూపత అనే ఐదు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. ప్రతి దశ పూర్తయిన తర్వాత అంతర్గత నాణ్యత తనిఖీ నిర్వహించి, ప్రతి సవరణకు సంబంధించిన ఆధార పత్రాలను భద్రపరచాలని తెలిపారు. అన్ని అభ్యంతరాలను పరిష్కరించి, బాధ్యతాధికారి ధృవీకరణ అనంతరం మాత్రమే జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ పార్ట్–ఎను నిర్ణీత గడువులో రాష్ట్ర జనగణన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జనగణన సంచాలకులు ఇచ్చిన మార్గదర్శకాలను జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. సంబంధిత శాఖల నుంచి నిర్ణీత నమూనాలో సమాచారాన్ని సేకరించి, పూర్తిస్థాయిలో పరిశీలన, ధృవీకరణ అనంతరం జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌కు సంబంధించిన వివరాలను నిర్ణీత కాలపట్టిక ప్రకారం రాష్ట్ర జనగణన కార్యాలయానికి రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పి సీఈవో నాగలక్ష్మి, ప్రణాళికాధికారి సునీత, జిల్లా పంచాయతీ అధికారి అనూష సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :