Wednesday, 16 September 2026 03:31:21 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించడంలో జిల్లా పోలీసుల ముందంజ

Date : 11 June 2025 06:07 PM Views : 675

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించడంలో జిల్లా పోలీసుల ముందంజ జిల్లాలోని సరిహద్దులో గల 20 మావోయిస్టు ప్రభావిత గ్రామాలకు పోలీసుల ఆధ్వర్యంలో మినీ రైస్ మిల్లుల అందజేత .జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కనీస సౌకర్యాలను అందించటమే మా లక్ష్యం : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారికి కనీస సౌకర్యాలను అందజేయటమే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.ఈరోజు చర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత సరిహద్దు గ్రామాలైన 20 గ్రామాలకు మినీ రైస్ మిల్లులను అందజేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పాల్గొన్నారు.రాళ్లపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్ లు కూడా పాల్గొన్నారు.సుమారుగా 50 లక్షల రూపాయల వ్యయంతో 20 గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మినీ రైస్ మిల్లులను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.మినీ రైస్ మిల్లు కొరకు ఏర్పాటు చేసిన షెడ్డుతో కలిపి ఒక్కో యూనిట్ విలువ 2,50,000/-రూపాయల ఖర్చుతో 20 గ్రామాలలో 20 యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు.రాళ్లపురం గ్రామంలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఎస్పీ గారు మాట్లాడుతూ నిషేధిత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు విద్య,వైద్యం,రవాణా వంటి కనీస సౌకర్యాలతో పాటు మౌళిక సదుపాయాలను కూడా అందించటమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని అన్నారు.తమ తమ గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్న పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని,అట్టి సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి కృషి చేస్తామని తెలిపారు.ఏజెన్సీ గ్రామాలలోని యువత అన్ని రంగాల్లో ముందుండాలని తెలిపారు.రాళ్లపురం గ్రామం నుండి జాతీయ స్థాయిలో సెయిలింగ్ క్రీడలో పాల్గొన్న ఆడమయ్యను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.అనంతరం అడమయ్యను ఎస్పీ గ్రామస్తుల సమక్షంలో ఘనంగా సన్మానించారు.నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని,అలాంటి అసాంఘిక శక్తులకు ఎవరూ సహకరించకూడదని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం తరపున పోలీసు శాఖ ఆదివాసి ప్రజలకు అందిస్తున్న అభివృద్ధిని,లొంగిపోయిన మావోయిస్టులకు కల్పిస్తున్న పునరావాస సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని మావోయిస్టు పార్టీలో పనిచేసే సభ్యులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.రాళ్లపురం గ్రామం నుండి నిషేధిత మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న పొడియం లక్ష్మి కుటుంబాన్ని సందర్శించి,ఆమె కుటుంబ సభ్యులకు దుస్తులను అందజేశారు.ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన మినీ రైస్ మిల్లును ప్రారంభించి,అట్టి మిషన్ పని చేసే విధానాన్ని ఎస్పీ పరిశీలించారు.ఈ సమావేశంలో పాల్గొన్న గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం చర్ల మండల పరిధిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో చర్ల సీఐ రాజు వర్మ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్సైలు నర్సిరెడ్డి,కేశవ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :