Wednesday, 16 September 2026 05:46:29 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించిన : భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్

Date : 25 August 2024 05:46 PM Views : 546

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : జిల్లాలోని వివిధ క్రీడలలో పాల్గొంటున్న యువ క్రీడాకారుల ప్రతిభ పాటవాలు, నైపుణ్యాలు వెలికి తీసి వారికి నచ్చిన క్రీడలలో ప్రోత్సాహం అందించి జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొని పథకాలు సాధించే విధంగా తోడ్పాటు అందించడానికి ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుందని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. ఆదివారం నాడు పాల్వంచ మినీ స్టేడియంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అథ్లెటిక్స్, ఆర్చరీ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 29న మేజర్ ధ్యాన్చంద్ ఒలంపిక్ హాకీ క్రీడాకారుడు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ క్రీడలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ క్రీడలలో పాల్గొనే యువకులు మేజర్ ధ్యాన్చంద్ హాకీ క్రీడాకారుడిని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఏ క్రీడలలో అయితే పాల్గొంటారో తప్పనిసరిగా మీలోని ప్రతిభను, నైపుణ్యాలను వెలికి తీసుకొని పథకాలు సాధించాలని అన్నారు. ప్రతిరోజు చదువుతోపాటు మీరు కోరుకున్న క్రీడలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి తప్పనిసరిగా సాధన చేస్తూ ఉండాలని ,మీరు అనుకున్న లక్ష్యం సాధించేవరకు విశ్రమించకూడదని అన్నారు. క్రీడలలో గెలుపు ,ఓటములు సహజమని ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహ పడవద్దని, తప్పనిసరిగా గెలవడానికి యువకులు ప్రయత్నించాలని అన్నారు. ఆర్చరీ అథ్లెటిక్స్ లలో పాల్గొనే యువకులకు సంబంధిత కోచ్ లు పిల్లలు ఆడుతున్న విధానాన్ని గమనించి వారికి సలహాలు సూచనలు ఇచ్చి తప్పనిసరిగా ఆర్చరీ, అథ్లెటిక్స్ విభాగాలలో పిల్లలందరూ మొదటి స్థానంలో గెలుపొందడానికి వారిలో స్ఫూర్తి నింపాలని అన్నారు. అనంతరం అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ మహిధర్ మాట్లాడుతూ మేజర్ ధ్యాన్చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని యువ క్రీడాకారులను గుర్తించి అథ్లెటిక్స్ లో 50 మంది, ఆర్చరీ లో 40 మంది క్రీడాకారులకు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు ఈనెల 29న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు బహుమతులు అందించడం జరుగుతుందని, యువకులలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీయడానికి ఈ పోటీలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్చరీ కోచ్ కళ్యాణ్, అథ్లెటిక్స్ కోచ్ నాగేందర్ ,హాకీ కోచ్ ఇమామ్, టెన్నిస్ అసోసియేషన్ సెక్రెటరీ యుగంధర్ రెడ్డి, హాకీ అసోసియేషన్ సెక్రెటరీ ప్రేమ్ కుమార్ జిల్లాలోని క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :