Saturday, 19 September 2026 05:49:55 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

మీసేవ సేవల ధృవీకరణకు భౌతిక పత్రాలు అవసరం లేదు- ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసిన పత్రాలనే పరిశీలించాలి- జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్

Date : 25 May 2026 05:57 PM Views : 117

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీసేవ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, ప్రజలకు సులభతరంగా అందించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదాయ, కుల, నివాస, కుటుంబ సభ్యుల ధృవపత్రాలు, ఇబీసీ , ఓబీసీ తదితర సేవల ధృవీకరణ కోసం ఈ ఎస్ డి అభివృద్ధి చేసిన GPOs & MRIs Verification Mobile Application అమలులో ఉన్నదని తెలిపారు. ఈ యాప్ ద్వారా సంబంధిత అధికారులు మీసేవ దరఖాస్తు వివరాలు, అప్లోడ్ చేసిన పత్రాలను ఆన్‌లైన్‌లో పరిశీలించి, అర్హత ఆధారంగా ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయాలు తీసుకునే విధానం అమల్లో ఉన్నదన్నారు. ఈ నేపథ్యంలో మీసేవ దరఖాస్తుల పరిశీలన కోసం ప్రజల నుండి ఎలాంటి భౌతిక పత్రాలను స్వీకరించరాదని స్పష్టం చేశారు. మండల, గ్రామ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు కూడా భౌతిక పత్రాలను కోరరాదని సి సి ఎల్ ఏ కార్యాలయం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజలు మీసేవ దరఖాస్తులకు సంబంధించిన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసిన అనంతరం ఎలాంటి భౌతిక పత్రాలను అధికారులకు లేదా సిబ్బందికి అందజేయవద్దని సూచించారు. జిల్లా పరిపాలన ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, ఇబ్బందుల్లేని సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మీసేవ సేవలకు సంబంధించిన సమస్యలు ఎదురైనట్లయితే సంబంధిత మండల అధికారులను లేదా జిల్లా మీసేవ మేనేజర్లను సంప్రదించాలని సూచించారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు : కృష్ణమూర్తి – 9133122022 రాకేష్ – 9000420792 ఈ -డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వర రావు – 7337340825 ను కూడా సంప్రదించవచ్చని తెలిపారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :