Wednesday, 16 September 2026 07:38:37 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

కలెక్టరేట్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు.బాలికల రక్షణ, విద్య, సాధికారతకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి – కలెక్టర్ అంకిత్.

Date : 28 August 2026 06:33 PM Views : 97

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్డ్రన్ హోమ్ బాలికలు జిల్లా కలెక్టర్ గారితో పాటు అదనపు కలెక్టర్ (రెవెన్యూ), అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా సంక్షేమాధికారి కి మరియు ఇతర అధికారులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అధికారులు బాలికలతో ఆప్యాయంగా ముచ్చటించి, వారి విద్య, భవిష్యత్ లక్ష్యాలు, అభిరుచుల గురించి తెలుసుకున్నారు. బాలికలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడంతో పాటు పుస్తకాలు, పెన్నులు, స్వీట్స్ తదితర బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాలికలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి, దేశానికి విలువైన సంపద అని అన్నారు. ప్రతి బాలికకు సురక్షితమైన వాతావరణం కల్పించడంతో పాటు, నాణ్యమైన విద్యను అందించి, వారు తమ కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.“బేటీ బచావో – బేటీ పడావో” స్ఫూర్తితో బాలికల రక్షణ, విద్య, ఆరోగ్యం, సాధికారతకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. బాలికలు ధైర్యంగా ముందుకు సాగి, ఉన్నత విద్యను అభ్యసించి, తమకు నచ్చిన రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.“బాలికను కాపాడుదాం – బాలికను చదివిద్దాం – బాలిక ఎదుగుదలకు తోడ్పడదాం” అనే సందేశంతో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాలికల భద్రత, విద్య, భవిష్యత్తు కోసం బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.రక్షాబంధన్ సందర్భంగా చిల్డ్రన్ హోమ్ బాలికలు అధికారులు, ప్రజాప్రతినిధులు, సమాజంలోని ప్రతి ఒక్కరి నుంచి తమకు అండగా ఉంటుందనే భరోసాను పొందారు. ఈ కార్యక్రమం బాలికల్లో ఆత్మవిశ్వాసం, భద్రతా భావం, కుటుంబ అనుబంధం పెంపొందించేలా ఆత్మీయ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమం లో హబ్ మిషన్ కోఆర్డినేటర్ సంతోష రూప , స్వాతి , ప్రియాంక , మౌనిక , దీప్తి , చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వినోద్ మరియు బాలికలు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :