Friday, 18 September 2026 03:19:33 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 23 March 2026 06:45 PM Views : 214

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించే విధంగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్డీవో మధు, గృహ నిర్మాణ శాఖాధికారి రవీంద్రనాథ్‌లతో కలిసి కలెక్టర్ ప్రజల వినతిపత్రాలను స్వయంగా స్వీకరించారు.జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించగా, వాటిని శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి తక్షణ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ప్రజావాణిలో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై శాఖాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులో చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సమర్థవంతమైన పరిపాలన అందించడంలో అధికారులు కట్టుబడి ఉండాలని తెలిపారు. ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని దరఖాస్తులు: ఇల్లందు మండలం తిలక్‌నగర్ గ్రామపంచాయతీకి చెందిన ఎట్టి కౌసల్య గత 20 సంవత్సరాలుగా రొంపేడు గ్రామ పరిధిలోని సర్వే నెం. 588/15/2లో ఉన్న 5 ఎకరాలు 07 గుంటల వారసత్వ వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నట్లు తెలిపారు. భూభారతి చట్టం ప్రకారం పాస్‌బుక్ కోసం రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, తన పేరు రెవెన్యూ రికార్డులో నమోదు కాలేదని, ఎలాంటి ఉత్తర్వులు అందలేదని పేర్కొంటూ పాస్‌బుక్ మంజూరు చేయాలని కోరారు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్, తగు చర్యల కోసం ధరణి ఆపరేటర్‌కు ఎండార్స్ చేశారు.దుమ్ముగూడెం మండలం బండారుగూడెం గ్రామానికి చెందిన కాటిబోయిన సూర్యకుమారి తమ కుటుంబం నిరుపేదదని, తమ కుమార్తె ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినప్పటికీ, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడంలో అవగాహన లోపంతో అవకాశం కోల్పోయినట్లు తెలిపారు. తమ కుమార్తెకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశం కల్పించాలని కోరగా, దరఖాస్తును పరిశీలించి తగు చర్యల కోసం సంబంధిత డి-సెక్షన్‌కు ఎండార్స్ చేశారు.ఇల్లందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి (ఎం.ఏ., బి.ఎడ్) పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం లభించలేదని, తగిన ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికి ఎండార్స్ చేశారు.గుండాల మండలం కాచనపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు రైతులు బోరు మరియు విద్యుత్ సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేయగా, దానిని పరిశీలించి తగు చర్యల నిమిత్తం ఐటీడీఏ పీవోకు ఎండార్స్ చేశారు.మణుగూరు మండలం కొత్త మల్లేపల్లి గ్రామానికి చెందిన మామిడి నాగేశ్వరరావు సింగరేణి ఓపెన్‌కాస్ట్ సేకరణలో ఇల్లు కోల్పోయినట్లు తెలిపారు. ల్యాండ్ లూజర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఎస్.ఈ.ఎస్ (SES) నెంబర్ తప్పుగా నమోదైనట్లు పేర్కొంటూ దానిని సరిచేయాలని కోరారు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్, తగు చర్యల కోసం భద్రాచలం సబ్ కలెక్టర్‌కు ఎండార్స్ చేశారు.ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :