తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామ పంచాయతీ ఎన్నికలు పక్కడిబందిగా నిర్వహించాలి అని సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి అన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 సందర్భంలో, జిల్లా ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్, గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి, ఎలక్షన్ ఎక్సపెన్దిచర్ పరిశీలకురాలు లావణ్యతో కలిసి, జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, ఏ ఓ లు, ఏ ఈ ఓ లతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతా చర్యలు, పోలింగ్‌కు సంబంధించిన అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, నోడల్ అధికారులు, పోలీస్ సిబ్బంది మరియు అన్ని సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉంటూ సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి, ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలి అని హెచ్చరించారు. ప్రజలు ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల భద్రతా ఏర్పాట్లను క్రమానుగుణంగా పరిశీలించాలని, అన్ని శాఖలు సమన్వయం గా పనిచేయాలని ఆయన స్పష్టంగా ఆదేశించారు. మొదటి దశ నామినేషన్ల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుని, రెండవ దశ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పోలింగ్ రోజు, ముందురోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పటిష్ట భద్రత, మద్యం నియంత్రణ, పోలింగ్ నిర్వహణలో తగిన సమగ్రత కోసం వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ వంటి కీలక అంశాలపై కూడా సవివరమైన సూచనలు అందించారు. అన్ని కార్యకలాపాలు తగిన విధంగా కొనసాగుతున్నాయా అని నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తక్షణమే పరిష్కరించబడేలా అధికారులకు ఆదేశించారు.రోజు వారి నివేదికలు క్రమం తప్పకుండ సమయానసారం అందించాలని అన్నారు. ఎలక్షన్ వ్యయ పరిశీలకురాలు లావణ్య మాట్లాడుతూ, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు అమలు చేయాలని, ఎఫ్ఎస్ఈ (ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్) మరియు ఎస్ఎస్ఈ (స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్) బృందాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ నిర్వహించమని సూచించారు. అభ్యర్థుల ఖర్చులు, పత్రికా ప్రచారం, సోషల్ మీడియా వ్యూహాలు వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశం లో సిపిఓ సంజీవరావు, ఇన్చార్జి డిపిఓ సుధీర్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, అడిషనల్ డి ఆర్ డి ఓ రవి, ఏవోలు ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ