తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్ నందు ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుకు మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ద్వారా ఏర్పాటుచేసిన వివిధ స్టాల్సును వారు తయారు చేసిన ఆహార పదార్థాలను ఆయన పరిశీలించి మహిళలను అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ముందుగా జ్యోతి ప్రజ్వలం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని మహిళా సంఘాల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అందిస్తున్న ప్రోత్సాహకాల గురించిన ప్రగతి నివేదికలను సభకు వివరించారు. అనంతరం కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. దీనిలో భాగంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళల సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సుల నిర్వహణ, మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వంటి పలు మహిళా అభ్యున్నతి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. గత పది సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు పంపిణీ జరగలేదని, ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డుల సవరణలు మరియు చేరికలు కూడా చేపట్టారన్నారు. ఈనెల 25 నుంచి 10 వ తారీకు వరకు ప్రతి మండల కేంద్రంలో రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తుగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగపరచుకోవాలని, తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడంతో పాటు కుటుంబాలు అభివృద్ధి, సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. మహిళల శక్తిని గుర్తించి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి, సుజాతనగర్ మరియు పాల్వంచ మండలాల్లో మొత్తం 2984 మహిళా సంఘాల లో 29,801 సంఘ సభ్యులు ఉండగా, బ్యాంకు లింకేజ్: ద్వారా 157 స్వయం సహాయక సంఘాలకు 18 కోట్ల 27 లక్షలు. వడ్డీ లేని రుణాలు :2100 స్వయం సహాయ సంఘాలకు రెండు కోట్ల 36 లక్షలు. లోన్ బీమా: ఈ పథకం ద్వారా 7 కి 5,90, 448 రూపాయలు. ప్రమాద భీమ: ఈ పథకం క్రింద -01 కి 10,00,000 రూపాయలు. మహాలక్ష్మి పథకం: ద్వారా పాల్వంచ మండలంలో ఒక బస్సుకు 69,468.00 రూపాయల చెక్కులను శాసనసభ్యుని చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్ డి ఓ మధు, డీఎస్ఓ రుక్మిణి, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, తాసిల్దార్ లు కొత్తగూడెం పాల్వంచ సుజాతనగర్ చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి, మహిళా సంఘాలు సభ్యులు మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ