Wednesday, 16 September 2026 05:23:57 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

విద్యుత్ షాక్‌తో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి.. ఘటనకు కారణమైన నలుగురు నిందితులు అరెస్ట్.

Date : 15 August 2026 08:17 PM Views : 254

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అటవీ జంతువులను వేటాడేందుకు అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చిన క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ మృతి చెందిన ఘటనలో బూర్గంపాడు పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.తేదీ 11.08.2026 రాత్రి నకిరేపేట అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా అటవీ జంతువులను విద్యుత్ షాక్ ద్వారా వేటాడేందుకు విద్యుత్ తీగలను అమర్చినట్లు సమాచారం అందడంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్, తన DRO అనార్కలి మరియు ఇతర సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ నిందితుల కోసం గాలిస్తుండగా అక్రమంగా అమర్చిన విద్యుత్ తీగ తగలడంతో నవీన్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు.DRO అనార్కలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు కారణమైన నిందితుల కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో లక్ష్మిపురం గ్రామంలోని ఆవుల నాగిరెడ్డి ఇంట్లో ఆవుల నాగిరెడ్డి, దాసరి నరేష్, తాటి వీరబాబు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన ముగ్గురు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు పట్టుకున్నారు. వారి సమాచారం మేరకు నాలుగో నిందితుడు కన్నెదారి అనంతయ్యను నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలోని అతని నివాసం వద్ద అరెస్ట్ చేశారు.నిందితుల వివరాలు: A1. ఆవుల నాగిరెడ్డి, తండ్రి: గురువారెడ్డి, వయస్సు: 44 సంవత్సరాలు, వృత్తి: ట్రాక్టర్ డ్రైవర్, నివాసం: లక్ష్మిపురం.A2. దాసరి నరేష్, తండ్రి: మల్లయ్య, వయస్సు: 35 సంవత్సరాలు, వృత్తి: మటన్ షాప్, నివాసం: లక్ష్మిపురం.A3. తాటి వీరబాబు, తండ్రి: వెంకన్న, వయస్సు: 28 సంవత్సరాలు, వృత్తి: కూలీ, నివాసం: లక్ష్మిపురం.A4. కన్నెదారి అనంతయ్య, తండ్రి: సెబాస్టియన్, వయస్సు: 58 సంవత్సరాలు, వృత్తి: వ్యవసాయం, నివాసం: నాగినేనిప్రోలు రెడ్డిపాలెం.స్వాధీనం చేసుకున్న వస్తువులు నిందితుల వద్ద నుండి బైండింగ్ వైరు, విద్యుత్ తీగలు అమర్చేందుకు కర్రలు పాతడానికి ఉపయోగించే గడ్డపలుగు, ఖాళీ క్వార్టర్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.అటవీ జంతువులను వేటాడేందుకు అక్రమంగా విద్యుత్ తీగలను అమర్చడం అత్యంత ప్రమాదకరమైన చర్య అని, ఇలాంటి చర్యల వల్ల అమాయక అటవీ జంతువులతో పాటు అటవీ, పోలీసు అధికారులు మరియు సాధారణ ప్రజల ప్రాణాలకు కూడా తీవ్ర ముప్పు ఏర్పడుతుందని పోలీసులు తెలిపారు.ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :