తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గం, లక్ష్మీదేవిపల్లి మండలం, మైలారం గ్రామపంచాయతీ వార్డు మెంబర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ బొబ్బాల రమేష్ గారు శుక్రవారంనాడు ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురైన విషయం తెలిసిన వెంటనే, *టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగా సీతారాములు గారు తన బృందంతో కలిసి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రమేష్ గారిని పరామర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులుతో మాట్లాడి రమేష్ గారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన సీతారాములు గారు, మెరుగైన వైద్యం అందించేందుకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రమేష్ గారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ