తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (అర్బన్): ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు )అర్హత మంజూరు నిబంధన 2 లక్షల రూపాయల నిబంధనలను సడలించి 3 లక్షలకి ఆదయ పరిమితి పెంచి రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.నేతాజీ బస్తి లో జరిగిన సిపిఐ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆహార భద్రత (రేషన్) కార్డులు మంజూరులో ఆదాయపరిమితి రెండు లక్షలు దాటిన వారికి రేషన్ కార్డులు అందని ద్రాక్షగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .సింగరేణి కార్మికుల పెన్షన్ లేదా ఒక ప్రైవేటు కార్మికుడి యొక్క వేతనాన్ని పరిగణలోకి తీసుకొని 2 లక్షలు ఆదాయం దాటితే రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదని ఇది సరికాదని ఆయన అన్నారు. ప్రైవేటు కార్మికుడు ఈరోజు యజమాని వద్ద డ్రైవర్ గా ఉద్యోగం చేస్తే రేపు ఉద్యోగం ఉంటదో! ఉండదో !అనే భయాందోళనలో ఉంటున్నారని, అలాంటప్పుడు వ్యక్తి యొక్క వేతనాన్ని పరిగణలోకి తీసుకోవటం సరికాదని ఆదాయంలో ఖర్చులు పోను మిగిలేదం దానిని మిగులు ఆదాయంగా తీసుకోవాలే తప్ప వచ్చిన మొత్తాన్ని ఆదాయంగా తీసుకోవడం సరికాదు. ఉదాహరణకు సింగరేణి కార్మికుడి/ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి వచ్చే పెన్షన్ నెలకి రూ.. 17500 /ఉంటే సంవత్సరానికి రెండు లక్షల పదివేల రూపాయలు ఆధారంగా చూపించి రేషన్ కార్డు దరఖాస్తులను తిరస్కరించడం సరికాదని అన్నారు. వారికి వచ్చిన పెన్షన్ లోనే వారు రోజువారి ఖర్చులు ,అనారోగ్య ఖర్చులు పోను వారికి మిగిలేది శూన్యమని అన్నారు. అలాంటప్పుడు దాన్ని ఎలా పరిగణలో తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు .ప్రభుత్వమే ఒకవైపు నైపుణ్యం చెందిన కార్మికుడు, నైపుణ్యం లేని కార్మికుడు పేరుతో చట్ట ప్రకారం వారి జీవన ప్రమాణం స్థాయిని పెంచి రోజువారి కూలీలు పెంచినప్పుడు ప్రభుత్వ పథకాలకు ఆదాయ పరిమితులు కూడా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆదాయ పరిమితిని ఐదు లక్షల రూపాయలు పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదయ పరిమితిని ఎందుకు పెంచలేదని ఆయన ప్రశ్నించారు. ఎంతోకాలంగా గ్రామీణ ప్రాంతాల కి లక్షన్నర ,టౌన్ ప్రాంతాలకు రెండు లక్షల రూపాయల ఆదాయ పరిమితి కొనసాగించడం సరికాదని ,మానవుడి యొక్క జీవన పరిస్థితులు మెరుగైనప్పుడు దానికి అనుగుణంగానే ప్రభుత్వ పథకాలకు ఆదాయపరిమితి పెంచి రేషన్ కార్డు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మహిళ నాయకురాలు ముద్ద మార్తమ్మ, సిపిఐ నాయకులు సబ్బని పాపారావు, జిట్టా నవీన్, దేవాపుత్రరాజమని, ముంతాజ్ ,కోటేశ్వరి, రాధా ,అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ