తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హెచ్ పి సి ఎల్ కంపెనీ విజయవాడ రీజినల్ కార్యలయం రీజినల్ ఆధ్వర్యంలో రీజినల్ మేనేజర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్ పి జి డిస్ట్రిబ్యూటర్స్ సమీక్షా సమావేశంలో ఎల్ పి జి డిస్ట్రిబ్యూషన్ అన్ని విభగాల్లో రీజినల్ పరిధిలో డోమెస్టిక్ సిలిండర్స్ సేల్స్ చేసినాందుకు గాను పాల్వంచ ఎల్ పి జి సెంటర్ మేనేజర్ ఆనంతుల లక్మి నారాయణ కి రీజినల్ మేనేజర్ పంకజ్ చౌదురి, డి. జి. యం. రాహుల్ సింఘ్, ఏరియా సేల్స్ మేనేజర్ పవన్ నరేష్ నుండి ఉత్తమ ప్రతిభ కనపరచ్చినందుకు అవార్డు అందుకున్నారు.మేనేజర్ లక్మి నారాయణ నీ పంకాజ్ చౌదరి ప్రత్యేకించి అభినందించారు. రీజినల్ పరిధిలో ఒక ప్రభుత్వ అధికారి ఉత్తమ అవార్డు దక్కించుకోవడం చాలా ఆరుదని తెలిపారు. అదేవిధంగా మిగతా డిస్ట్రిబ్యూటట్స్ నీ పాల్వంచ ఎల్ పి జి సెంటర్ నీ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.రీజినల్ పరిధిలో ఇంతా కంపిటిషన్ వున్నా డిస్ట్రిబ్యూటర్స్ లో మన భద్రాద్రి జిల్లా పాల్వంచ పౌర సరఫరా సంస్థ ఎల్ పి జి సెంటర్ కి ఉత్తమ అవార్డు రావడం తో మేనేజర్ ఆనంతుల లక్ష్మీనారాయణ ప్రత్యేకించి అభినందించిన జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ , అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.... గ్యాస్ వినియోగదారులకు సకాలం లో సరఫరా అయ్యేటట్లు, గ్యాస్ వల్ల ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తెలిసేలా చర్యలు తీసుకొవ్వాలని తెలియచేశారు. భవిష్యత్తులో కూడా గ్యాస్ వినియోగదారులకు సకాలం లో గ్యాస్ సరఫరా చేస్తూ ఇలాంటి ఉత్తమ అవార్డులు, పురస్కారాలు హెచ్. పి. సి. యల్. వారినుండి తీసుకొవాలని తీసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో డి. సి. యస్. ఓ. ప్రేమ్ కుమార్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ త్రినాద్ బాబు,హెచ్ పి గ్యాస్ మేనేజర్, ఆనంతుల లక్ష్మీనారాయణ, కంప్యూటరు ఆపేరేటర్లు రజిత, నరేష్, మెకానిక్ ప్రకాష్ లు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ