తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లాలో పెంపుడు కుక్క గోరు గుచ్చుకుని సందీప్ అనే యువకుడు మరణించాడు. రెండు నెలల క్రితం కుక్కపిల్లను తెచ్చుకున్న సందీప్, దానిని మచ్చిక చేసుకుంటుండగా అది తన తండ్రిని కరిచింది. అదే సమయంలో కుక్క కాలి గోరు సందీప్ కాలికి గుచ్చుకుంది. తండ్రికి చికిత్స చేయించిన సందీప్ తన గాయాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఇటీవల రేబీస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు.
Admin
తెలుగు వెలుగు టీవీ