తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 7 తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండలంలోని నాటుసారా విక్రయిస్తున్న నలుగురిని ఎస్సై జె రమేష్ ఆదేశాలు మేరకు ఎక్స్చేంజ్ హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రావు తాసిల్దార్ టి శ్రీనివాసరావు ఎదుట బైండోవర్ చేశారు. బోడ నీల సూరారం, నునావత్ పార్వతి అన్నారుపాడు, ధారావత్ జామ సూరారం, అజ్మీర గిల్లి కొమ్ముగూడెం అక్రమంగా నాటుసారా విక్రయించినందుకు బైండోవర్ చేసామని ఎక్స్చేంజ్ హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రావు అన్నారు అక్రమంగా ఎవరు నాటు సారా విక్రయించిన తయారు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎవరైనా ఉల్లంగించినట్లితే 2 లక్షలు జరిమానా విధిస్తామని తాసిల్దార్ టి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ