Saturday, 19 September 2026 03:49:32 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 24 May 2026 06:59 PM Views : 167

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇండ్ల స్థలాలు దక్కే వరకు అండగా ఉంటాం. సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల విధులు, బాధ్యతలు అత్యంత కీలకమైనవి. యాజమాన్యాల తీరు మారాలి, శ్రమకు తగ్గ ప్రతిఫలం అందించాలి. నిష్పక్షపాత వైఖరితోనే జర్నలిజం విలువలు కాపాడబడతాయి. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి. వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ జర్నలిస్టులు సాహసోపేతంగా పనిచేస్తున్నారు క్షేత్రస్థాయిలో పనిచేసే విలేకరుల భద్రతకు పెద్దపీట వేయాలి.ఐక్యతతోనే జర్నలిస్టుల హక్కుల సాధన సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టులు ఫోర్త్ ఎస్టేట్‌గా తమ పాత్రను సమర్థవంతంగా పోషించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.జర్నలిస్టుల హక్కుల రక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తృతీయ మహాసభ ఆదివారం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్బులో ఘనంగా జరిగింది. ఈ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల విధులు, బాధ్యతలు అత్యంత కీలకమైనవని ఆయన కొనియాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఫోర్త్ ఎస్టేట్‌గా జర్నలిస్టులు పోషిస్తున్న పాత్ర అమోఘమైనదని, క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కొంటూ సాహసోపేతంగా విధులు నిర్వహిస్తున్నారని అభినందించారు. అయితే ప్రస్తుత తరుణంలో కొన్ని మీడియా యాజమాన్యాల తీరు మారాల్సిన అవసరం ఉందని, రాత్రింబవళ్లు శ్రమించే జర్నలిస్టులకు వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం, వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల సుదీర్ఘకాల సమస్య అయిన ఇండ్ల స్థలాల అంశంపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇండ్ల స్థలాలు దక్కే వరకు తాను వ్యక్తిగతంగా, పార్టీ పరంగా పూర్తి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి హెల్త్ కార్డూ, ఇండ్ల స్థలాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమాజంలో నిష్పక్షపాత వైఖరితో వార్తలు రాసినప్పుడే జర్నలిజం విలువలు కాపాడబడతాయని, వృత్తిపరమైన బాధ్యతను విస్మరించవద్దని సూచించారు. జర్నలిస్టులందరూ ఐక్యతతో ముందుకు సాగాలని, అప్పుడే హక్కుల సాధన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి, వారి కుటుంబాల భద్రతకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని కూనంనేని సాంబశివరావు హామీ ఇచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :