తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆగస్టు 16వ తారీకు ఆదివారం ఉదయం 8:30 గంటలకు కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో జరిగే బ్లడ్ డొనేషన్ క్యాంపును విజయవంతం చేయగలరు. కొత్తగూడెం క్లబ్ కార్యదర్శి సీనియర్ లయన్ కోనేరు పూర్ణచందర్రావు. ఈరోజు శ్రీనగర్ కాలనీలో కోనేరు నివాసంలో జరిగిన కార్యక్రమంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ బ్రోచర్లు ఆవిష్కరించి ప్రసంగించిన కోనేరు పూర్ణచంద్రరావు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ముఖ్యంగా ఆపదలో బ్లడ్ అవసరమైన వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ గౌరవాధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్, లయన్స్ క్లబ్ ట్రెజరర్ శ్రీశైలం జయకుమార్. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ సభ్యులు రాజేష్, జబ్బు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ