Thursday, 17 September 2026 12:54:58 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఏరియా స్టోర్స్‌ కార్మికులను కలిసిన నూతన బ్రాంచ్‌ కార్యదర్శి గట్టయ్య.

Date : 13 August 2026 05:52 PM Views : 107

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఘనంగా సన్మానించిన కార్మికులు.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ.కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా నూతన బ్రాంచ్‌ కార్యదర్శి జె. గట్టయ్య అన్నారు. గురువారం కొత్తగూడెం ఏరియా స్టోర్స్‌ను ఆయన సందర్శించి కార్మికులను కలిశారు. నూతనంగా బ్రాంచ్‌ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన గట్టయ్యకు ఏరియా స్టోర్స్‌ కార్మికులు ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గట్టయ్య అడిగి తెలుసుకున్నారు.ముఖ్యంగా స్టోర్స్‌లో అవసరమైన మేరకు మ్యాన్‌పవర్‌ను పెంచాలని, కార్మికులకు ప్లే డేలు, పీహెచ్‌డీలను పెంచడంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు.అనంతరం ఏరియా స్టోర్స్‌ డీజీఎం మైనేని శ్రీనివాసరావును గట్టయ్య మర్యాదపూర్వకంగా కలిసి కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. స్టోర్స్‌లో పని పరిస్థితులు, సిబ్బంది కొరత, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో ఏఐటీయూసీ రాజీపడే ప్రసక్తే లేదని గట్టయ్య స్పష్టం చేశారు. ఏరియా స్టోర్స్‌కు సంబంధించిన సమస్యలపై ఇప్పటికే అధికారులతో చర్చలు జరుపుతున్నామని, ఒక్కో సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం యూనియన్‌ నిరంతరం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.త్వరలోనే పెండింగ్‌ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్,ఆర్.సి. హెచ్.పి పిట్ కార్యదర్శి సురేందర్,ఏరియా స్టోర్స్‌ పిట్‌ కార్యదర్శి,కమల్(శ్రీనివాస్) , ఎస్ & పి సి పిట్ కార్యదర్శి రాంబాబు ,నాయకులు రాజాలపూడి సాంబమూర్తి ,,అవినాష్,వేముల నరేష్, లికిత్,సాగర్,సురేష్,రాజేష్,మెయిన్,గావిని నాగరాజు, పడాల కృష్ణ,డి ఎల్ ఆర్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :