తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిపిఎస్ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారుల విద్యాభ్యాసం బలోపేతం చేయండి.చదువులో వెనుకబడ్డ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించండి.ప్రతి పిల్లవానికి ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు మరియు వారధి వర్క్ బుక్ లోని ప్రతి అంశం తెలిసి ఉండేలా ఉపాధ్యాయుల కృషి చేయాలి.ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్. గిరిజన సంక్షేమ ఆధ్వర్యంలో నడపబడుతున్న జిపిఎస్/ ఏ యు పి ఎస్ పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికలకు పునాది నుండే విద్యావ్యవస్థ బలోపేతం కావడానికి ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు ప్రైమరీ పిల్లలకు వారధి వర్క్ బుక్ లోని ప్రతి అంశం ప్రతి పిల్లవానికి అందరికీ అర్థమయ్యేలా ఉపాధ్యాయులు బోధించాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. బుధవారం నాడు పాల్వంచ మండలంలోని ఉలవనూరు ఏయుపిఎస్ మరియు జిపిఎస్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో కాసేపు ఉపాధ్యాయుని పాత్ర అనంతరం విద్యార్థి పాత్ర పోషించి ఉద్దీపకం వర్క్ బుక్ సంబంధించిన అంశాలు పిల్లలకు బోధిస్తున్న తీరును మరియు తానే స్వయంగా పిల్లల చేత ఉద్దీపకం వర్క్ బుక్ లోని ప్రతి అంశం పిల్లల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పిల్లలు ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు మరియు చతుర్వేద ప్రక్రియల లోని అంశాలు, గుణకారాలు, బాగాహారాలు పిల్లలు అడిగిన వెంటనే చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలందరూ ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు తప్పనిసరిగా ప్రతి పిల్లవానికి తెలిసి ఉండాలని, ఉద్దీపకం వర్క్ బుక్ నిర్వహణ ప్రతిరోజు సక్రమంగా జరగాలని అన్నారు. ఉద్దీపకం వర్క్ బుక్ ఒకటి, రెండు ప్రవేశపెట్టడంతో జిపిఎస్ పాఠశాలలో చదువుతున్న చిన్నారుల విద్యాభ్యాసం చాలావరకు మెరుగుపడిందని, ఉద్దీపకం వర్క్ బుక్ -3లో పిల్లలు సులభంగా అర్థం చేసుకొని వర్క్ బుక్ రాసే విధంగా ఎక్కువ శాతం కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించిన జనరల్ అంశాలు చేర్చడం జరిగిందని, మహనీయుల జీవిత చరిత్ర, వ్యాసాలు, టెక్నికల్ కు సంబంధించిన కంప్యూటర్ పరిజ్ఞానం, చంద్రయాన్ రోబోటిక్స్, ఇండియాకు సంబంధించిన కల్చర్, రైతులు పంటలు పండించే విధానం, అధికారుల యొక్క పేర్లు తెలిసే విధంగా చాప్టర్ తో పాటు ఓఎంఆర్ సీట్ పెట్టడం జరిగిందని, ఉపాధ్యాయులు బోధించేటప్పుడు పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా వారికి బోధించుకుంటూనే ఓఎంఆర్ షీట్ పిల్లలు స్వతగా రాసేలా చూడాలని అన్నారు. ప్రతిరోజు పిల్లలందరూ పాఠశాలకు వచ్చేలా సంబంధిత ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి ప్రతిరోజు పిల్లలను తప్పనిసరిగా బడికి పంపించేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు.ఉపాధ్యాయులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలలకు రావాలని,ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పై అధికారులు దృష్టికి తీసుకొని రావాలని, ఉద్దీపకం వర్క్ బుక్ నిర్వాహణ తప్పనిసరిగా పిల్లలు అర్థం చేసుకొని రాసేలా ఉపాధ్యాయులు పిల్లలను ఉత్తేజపరచాలని అన్నారు.8వ తరగతి,9వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు కాంపిటేటివ్ పరీక్షలకు హాజరయ్యేటప్పుడు ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా సులభంగా రాయడానికి ఇప్పుడు ప్రవేశపెట్టిన వారదీపుస్తకములో జనరల్ నాలెడ్జి తో పాటు అన్ని కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించిన అంశాలు పొందుపరచడం జరిగిందని దానికి ఉపాధ్యాయులు తప్పనిసరిగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఆయన అన్నారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనాలు చేసి ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనాలు పెడుతున్నది లేనిది పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం నాణ్యతగా ఉండే ఆహారం పిల్లలకు అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.వర్షాకాలం నడుస్తున్నందున పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రాత్రిపూట పిల్లలు ఎవరు బయటకు రాకుండా చూడాలని ఏఎన్ఎం 24 గంటలు ఉండి పిల్లల ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో దమ్మపేట ఏటీడీవో చంద్రమోహన్,ఎస్ సి ఆర్ పి హరిలాల్, పీజీ హెచ్ఎం విజయలక్ష్మి, గ్రామ సర్పంచ్ వజ్జా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ