Saturday, 19 September 2026 05:51:02 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 21 May 2026 06:31 PM Views : 212

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖల కార్యాలయాలను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన, క్రమశిక్షణ, ప్రజలకు అందించే సేవలపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ జిల్లా విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, పౌర సరఫరాల శాఖ, కార్మిక శాఖ, ఉపాధి కల్పన శాఖ, వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయాల్లో సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.తనిఖీల సందర్భంగా కలెక్టర్ ప్రతి కార్యాలయంలోని సీట్ల వద్దకు వెళ్లి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న సీట్లను పరిశీలించి సంబంధిత ఉద్యోగులు ఇప్పటివరకు ఎందుకు విధులకు హాజరుకాలేదని అధికారులను ప్రశ్నించారు. సరైన కారణాలు తెలియజేయకుండా ఆలస్యంగా వస్తున్న సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని, ఈరోజు జీతంలో కోత విధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్, ప్రతి ఉద్యోగి ఉదయం 10:30 గంటలలోపు తప్పనిసరిగా కార్యాలయాలకు హాజరు కావాలని స్పష్టం చేశారు. విధులకు హాజరైన ప్రతి ఉద్యోగి హాజరు రిజిస్టర్‌లో తప్పనిసరిగా సంతకం చేయాలని సూచించారు. నిర్ణీత సమయానికి కార్యాలయాలకు రాకపోవడం లేదా హాజరు రిజిస్టర్‌లో సంతకం చేయని వారిని గైర్హాజరుగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తారని, ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదని అన్నారు . ప్రతి శాఖలో అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలని సూచించారు.ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన, క్రమశిక్షణ, పారదర్శకత పెంపొందించేందుకు ఇటువంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు ఈ తనిఖీలో కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఏవో అనంత రామకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :