Friday, 18 September 2026 03:08:28 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 03 June 2026 06:06 PM Views : 85

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జూన్ 4, 6, 8, 10 తేదీలలో నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల ఏర్పాట్లపై బుధవారం జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించడం, గ్రామాలు, వార్డుల స్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టడం లక్ష్యంగా గ్రామ, వార్డు సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలాల పరిధిలోని గ్రామాలను నాలుగు క్లస్టర్లుగా, మున్సిపాలిటీల పరిధిలోని వార్డులను కూడా క్లస్టర్లుగా విభజించి ప్రణాళికాబద్ధంగా సభలను నిర్వహించాలని సూచించారు. గ్రామ, వార్డు సభల ద్వారా ప్రజలకు వానాకాల సన్నద్ధత, పారిశుధ్య నిర్వహణ, అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, చెరువులు మరియు జల వనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కల నాటకం మరియు సంరక్షణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి గ్రామం, వార్డులో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, పంటల మార్పిడి విధానం, ఎరువుల సమతుల వినియోగం, ఫార్మా రిజిస్ట్రేషన్, వానాకాల సాగుకు సంబంధించిన సూచనలపై అవగాహన కల్పించాలని తెలిపారు. అదేవిధంగా జనగణన కార్యక్రమం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)పై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి కార్యక్రమాల విజయవంతానికి కృషి చేయాలని అన్నారు . విద్యుత్, నీటిపారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించిన సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామ, వార్డు సభల్లో విస్తృతంగా వివరించాలని ఆదేశించారు. ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొనేలా ముందస్తుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రామ, వార్డు సభలకు ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, సభల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించేందుకు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గ్రామ, వార్డు సభలను సమర్థవంతమైన వేదికలుగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :