తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 10 (తెలుగు వెలుగు) వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్. జూలూరుపాడు పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిటీలు మెంబర్గా ఎన్నికైన అయినందున జూలూరుపాడు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్, కాంగ్రెస్ నాయకులు రాందాస్ నాయక్ ను పూల బుకే ఇచ్చి, సాలువతో సన్మానించారు. అనంతరం గుండెపూడి పంచాయతీలోని సోమవారం రోజున గండి పడిన మేడికుంట చెరువును సందర్శించారు. ఎమ్మెల్యే చెరువు కరకట్ట గురించి ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో సంభాషించారు. తదుపరి రైతులతో మాట్లాడుతూ ఎటువంటి సమస్య వచ్చినా అధికారులకు వెంటనే తెలియజేయవలసిందిగా కోరారు. అనంతరం గుండెపూడి గ్రామంలో మాజీ సొసైటీ చైర్మన్ కొమ్మన్ని కృష్ణయ్య గ్రామపంచాయతీకి. (మార్చురీ బాడీ ఫ్రీజర్) ఎమ్మెల్యే చేతుల మీదగా వితరణగా అందజేశారు. తదుపరి మండలంలోని పాపకొల్లు గ్రామంలో సాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా. ఆ మహానీయురాలి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు
Admin
తెలుగు వెలుగు టీవీ