తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన సెంటర్లో బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ