తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 6 తెలుగు వెలుగు ) జూలూరుపాడు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డులు కలిగిన వేతన కార్మికులు (Wage Seekers) తమ గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా తప్పనిసరిగా E-KYC అప్‌డేషన్ చేయించుకోవలసిందిగా మండల అభివృద్ధి అధికారి వేతన కార్మికులను కోరారు.E-KYC అప్‌డేషన్ చేయించుకోని కూలీలు ఇకపై ఉపాధి హామీ పథకం కింద పనులకు హాజరు కావడం లేదా పనులు పొందడం సాధ్యంకాదు. అలాగే, అట్టి కూలీలకు వ్యక్తిగత పనులను శాంక్షన్ చేయడం కూడా కుదరదు. కావున, మండలంలోని ప్రతి జాబ్ కార్డు దారులు తమ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్‌ను వెంటనే సంప్రదించి, రేపు సాయంత్రం లోగా E-KYC అప్‌డేషన్ పూర్తి చేయించుకోవాలి.అలాగే, చనిపోయిన వ్యక్తుల పేర్లు, పెళ్లయి అత్తగారింటికి వెళ్లిన మహిళల పేర్లు మొదలైన వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్‌కు తెలియజేసి, జాబ్ కార్డు నుండి తొలగించుకోవలసిందిగా తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ