తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీతారామ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి.నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మంత్రి తుమ్మల భేటీ.సీతారామ ప్రాజెక్టు పనులపై సుదీర్ఘ చర్చ.మూడో నుంచి నాలుగో పంప్ హౌస్ మధ్యలో 532 ఎకరాల భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలి.జూలూరుపాడు టన్నెల్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.సాగర్ ఆయకట్టు పంటలకు మరోసారి నీటిని విడుదల చేయాలి.సీతారామ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం భేటీ అయ్యారు. సీతారామ ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి అవసరాలు, ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరువురు మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా రైతులకు త్వరితగతిన సాగునీరు అందేలా పెండింగ్ పనులను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల కోరారు రూ.45 కోట్లతో 532 ఎకరాల భూసేకరణను త్వరగా పూర్తి చేయాలి.మూడో పంప్‌హౌస్ నుంచి నాలుగో పంప్‌హౌస్ వరకు నీటిని తరలించేందుకు అవసరమైన 532 ఎకరాల భూసేకరణ ప్రక్రియను రూ.45 కోట్లతో చేపట్టినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల పరిధిలో ఈ భూసేకరణ పూర్తయితే ఆయా ప్రాంతాలకు గోదావరి జలాలు అందుతాయని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సుమారు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు.సంబంధిత పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలి.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతుల భూములన్ని సస్యశ్యామలం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రిని కోరారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆయకట్టు రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భూ సేకరణ, పైప్ లైన్ నిర్మాణం పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.ములకలపల్లి మండలం కమలాపురంలోని మూడో పంప్‌హౌస్ నుంచి దమ్మపేట మండలం లోని నాలుగో పంప్‌హౌస్ వరకు కాలువ ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనలు ఉన్నాయని మంత్రి తెలిపారు. అయితే నాలుగో పంప్‌హౌస్ నుంచి దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని చెరువులకు గోదావరి జలాలను కాలువల ద్వారా అందించే ప్రతిపాదనలకు బదులుగా పైప్‌లైన్ ద్వారా నీటిని అందించేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. పైప్‌లైన్ పనులకు అవసరమైన అంచనాలు రూపొందించి, నిధులు విడుదల చేసి పనులను చేపడితే భూసేకరణ వ్యయం తగ్గడంతో పాటు రైతులు తమ భూములను కోల్పోవాల్సిన అవసరం ఉండదని మంత్రి తుమ్మల వివరించారు.జూలూరుపాడు టన్నెల్ పనులు వేగవంతం చేయండి...జూలూరుపాడు టన్నెల్ పనులను త్వరితగతిన పూర్తి చేసి పాలేరు జలాశయానికి నీటిని అందించాలని మంత్రి తుమ్మల కోరారు.సాగర్ ఆయకట్టు పరిధిలోని వైరా, లంకసాగర్ ప్రాంతాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇటీవల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కొనసాగితే ఆయకట్టు పరిధిలోని పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, రైతుల పంటలను రక్షించేందుకు సీతారామ ప్రాజెక్టు ద్వారా మరోసారి సాగునీటిని విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.మంత్రి తుమ్మల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెండు మూడు రోజుల్లో సాగర్ ఆయకట్టు పంటలకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పైప్‌లైన్, టన్నెల్ తదితర పనులను వేగవంతం చేసి, రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ