Wednesday, 16 September 2026 09:52:59 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

సింగరేణి ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి.సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య.

Date : 09 September 2026 05:55 PM Views : 83

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి.యాజమాన్యం అడ్డంకులను ప్రభుత్వం తొలగించాలి. గతంలో మాదిరిగానే నిర్మాణ వెసులుబాటు కల్పించాలి. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య.జీవో 76 ద్వారా సింగరేణి ప్రాంతాల్లో నివాసముండే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే క్షేత్రస్థాయిలో పేదలు ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం పూర్తి వెసులుబాటు కల్పించాలని సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య డిమాండ్ చేశారు. రామవరంలో బుధవారం జరిగిన సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినప్పటికీ, సింగరేణి యాజమాన్యం స్థలాల్లో నిర్మాణాలకు అంగీకరించని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు, సింగరేణి పరిధిలో ఆటంకాలు లేకుండా పేదలు ఇండ్లు నిర్మించుకునే వెసులుబాటు కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుతం కొత్తగూడెం పట్టణ, పరిసర ప్రాంతాలైన రామవరం, గౌతంపూర్, రుద్రంపూర్, 3 ఇంక్లైన్, 4 ఇంక్లైన్, బర్మా క్యాంపు తదితర ఏరియాలు, గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నివసించే వారిలో అత్యధికులు ప్రస్తుత, మాజీ సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు మరియు సంస్థపై ఆధారపడి జీవిస్తున్న నిరుపేదలేనని ఆయన వివరించారు. ప్రభుత్వం మంజూరు చేసినా యాజమాన్యం ఆంక్షల వల్ల పేదలు గూడు నిర్మించుకోలేని గందరగోళ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని, సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి పేదలకు సొంతింటి నిర్మాణానికి ఆటంకాలు లేకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. లేనిపక్షంలో సింగరేణి పేదల పక్షాన నిలిచి దశలవారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు గోపికృష్ణ, తూముల శ్రీను, మండల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :