Sunday, 02 August 2026 02:45:43 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

అంగన్వాడీల అభివృద్దె మా లక్షం - వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

Date : 15 April 2026 10:27 AM Views : 198

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ : వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ స్థానిక వైరాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జిల్లా సంక్షేమ అధికారిణి వేల్పుల విజేత అధ్యక్షతన, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ నియోజకవర్గ పరిధిలో గల అంగనవాడి టీచర్ల అందరికీ స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం మరియు దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వానికి దీటుగా తమ ప్రభుత్వం అంగనవాడిలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, నియోజకవర్గ పరిధిలోగల అంగనవాడి టీచర్లు పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్య దృశ్య సరైన సమయంలో సరైన పద్ధతిలో పారదర్శకతతో కూడిన సేవలు అందించాలని, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంగన్వాడీలకు ఇచ్చిన హామీలన్నిటిని ప్రభుత్వం త్వరలో పరిష్కరించబడతాయని, త్వరలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15,000 అంగనవాడి టీచర్ల ఉద్యోగ భర్తీకై నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందని , వైరా నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏదైనా అంగనవాడి కేంద్రం అద్దె భవనాలలో నడుస్తున్నట్లయితే తన నిధుల ద్వారా శాశ్వత పరిష్కారంలో మార్గంగా పక్కా భవనాలు నిర్మించడం జరుగుతుందని దానికి అనుగుణంగా ఇప్పటికే అద్దె భవనాలలో నడుస్తున్న అంగన్వాడి కేంద్రాలను గుర్తించి ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగిందని, త్వరలోనే శాశ్వత ప్రాతిపదికన బిల్డింగ్ నిర్మాణాలు చేపడతామని అంగన్వాడీ టీచర్లకు హామీ ఇచ్చారు. అదేవిధంగా గతంలో టీచర్లు రాతపూర్వకంగా 16 రిజిస్టర్లలో తమ కేంద్రంలో నమోదైన లబ్ధిదారుల యొక్క వివరాలు వారికి అందిస్తున్న సేవలు లిఖితపూర్వకంగా రాయాల్సి ఉండగా మన ప్రభుత్వం దానికి స్వస్తి పలుకుతూ కాలానుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్ ఫోన్లు అందజేయడం జరిగిందని, తద్వారా ప్రతి ఒక్క అంగన్వాడి టీచర్ రమ్మని విధి నిర్వహణ ఒక బాధ్యతగా కాకుండా సేవా రూపంలో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చిన లబ్ధిదారులకు అందజేసినట్లయితే తమ జన్మ ధన్యం అవుతుందని, నియోజకవర్గ పరిధిలో గల అంగనవాడి టీచర్లు క్షేత్రస్థాయిలో క్యాటగిరిల వారీగా పౌష్టికాహారం అందజేస్తూ ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి భాగస్వామ్యం అవుతున్నారని కొనియాడారు . వైరా నియోజకవర్గ పరిధిలో అతి తీవ్ర పోషణ లోపం, తీవ్ర పోషణ లోపం, పోషణ లోపం లేకుండా సరైన సమయంలో సరైన విధంగా పౌష్టికారము అందజేసి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా పూర్వ ప్రాథమిక విద్యా అందజేసినట్లయితే మెరుగైన ఫలితాలు రాబట్ట వచ్చు అని, ఎప్పటికప్పుడు అంగన్వాడి కేంద్రాల పరిశుభ్రతతో పాటు ఆటపాటలతో చదువుకునే విధంగా అహలోదకరమైన వాతావరణం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ను సరైన పద్ధతిలో సక్రమంగా వినియోగించుకోవాలని ఎప్పటికప్పుడు లబ్ధిదారుల హాజరు శాతం, అందిస్తున్నటువంటి సేవలు అందులో పొందుపరుస్తూ ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారులకు నివేదిక అందజేసి పోషణ లోప రహిత నియోజకవర్గంగా జిల్లాలోని ముందుండాలని కోరారు. అదేవిధంగా దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, వారిలో మనోధైర్యం ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు సాధారణ ప్రజానీకానికి దీటుగా వారికి సమాజంలో మంచి గుర్తింపు రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఖజానాలో తక్కువ మొత్తం ఉన్నప్పటికీ దివ్యాంగుల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా వారి అవసరాలకు వారి ఆర్థికంగా , వ్యాపార రంగాలలో, విద్యారంగాలలో, ముందంజలో ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్స్ , స్కూటీలు ( త్రి చక్ర వాహనాలు), ఆధునికా బ్యాటరీ వీల్ చైర్స్ ,బ్యాటరీ ట్రై సైకిల్స్, ట్రై సైకిల్స్ అందజేయడం జరుగుతుందని, ఈరోజు నియోజకవర్గానికి 12 స్కూటీలు మంజూరు చేసి వికలాంగుల పక్షపాతిగా నిలిచిన జిల్లా సంక్షేమ అధికారిణి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిడిపివోలు దయామని, కమల ప్రియ, బాల త్రిపుర సుందరి, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు , మండల అధికారులు, సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :