Monday, 02 November 2026 06:17:31 PM
# కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

రోడ్డు ప్రమాడానికి గురైన మిత్రుడికి ఆర్ధికసహాయం చేసిన స్నేహితులు

Date : 30 June 2026 06:08 PM Views : 238

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : చదువుకునే రోజుల్లో పుస్తకాలు పంచుకున్న స్నేహం, కష్టకాలంలో కన్నీళ్లు తుడిచే బంధంగా మారింది. గత వారం కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన తమ చిన్ననాటి మిత్రుడు గార్లపాటి నరసింహారావు (GNR) కు, 10వ తరగతి 1997- 1998 బ్యాచ్ సహచరులు ప్రేమతో అండగా నిలిచి మానవత్వాన్ని చాటారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం చిన్న హరిజనవాడకు చెందిన గార్లపాటి నరసింహారావు ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ్లి వస్తుండగా, కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నరసింహారావును 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మిత్రబృందం వెంటనే 10వ తరగతి వాట్సాప్ గ్రూప్ ఒక్కటైంది. "మనోడు కిందపడితే మనం చూస్తూ ఉండలేం" అంటూ ఒక్కొక్కరూ తమకు తోచిన సాయం చేశారు. ఎవరికీ చెప్పకుండా, ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా కేవలం 24 గంటల్లోనే రూ,94,000 జమ చేశారు. ఈ మొత్తాన్ని మిత్రులందరూ కలిసి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న నరసింహారావుకు స్వయంగా అందజేశారు. "డబ్బు ఇవ్వడం కాదు, 'మేమున్నాం' అనే ధైర్యం ఇవ్వడం ముఖ్యం" అని మిత్రబృందం తెలిపింది. బాల్యంలో కలిసి తిన్న త్రాగిన గోళీ సోడా రుచి, కలిసి కొట్టిన ఆడిన ఆటల గాయాలు ఇప్పటికీ మధురమేనని, ఆ స్నేహమే ఇప్పుడు ఆపదలో ఆదుకునేలా చేసిందని వారు భావోద్వేగానికి గురయ్యారు. స్నేహానికి వయసుతో పనిలేదని, ఆపదలో ఆదుకునే మనసుండాలని నిరూపించిన ఈ మిత్రులను గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అభినందిస్తున్నారు. నరసింహారావు త్వరగా కోలుకొని మళ్లీ మామూలు మనిషి కావాలని, మరలా అందరితో కలిసి నవ్వాలని మిత్రబృందం మనసారా కోరుకుంటోంది ఈ కార్యక్రమంలో నేలాల చక్రవర్తి, నేలాల నరసింహారావు, పూర్ణకంటి నరసింహారావు, చాపల మడుగు నరసింహారావు, ఇల్లంగి రాంబాబు, పురస్తతపురపు రామకృష్ణ, ఎలబాక శంకరాచారి, ఉసికల నరసింహరావు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :