తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : )మానసిక ఒత్తిడి అధిగమించేందుకు యోగా ఒక్కటే అత్యుత్తమ మార్గమని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. కొత్తగూడెం పట్టణంలోని ప్రముఖ యోగ గురువు గుమలాపురం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత యోగా శిక్షణ క్యాంపు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు పురాతన కాలం నుంచి యోగాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, మా నవ శక్తులన్నింటినీ ఏకం చేసి ఏకాగ్రత సాధించడం యోగాకే సాధ్యమన్నారు. చిన్నప్పటి నుండే యోగ పట్ల మక్కువ పెంచుకోవడం ద్వారా చేకూరే ప్రయోజనాలను చెప్పి పిల్లల్లో స్ఫూర్తి నింపారు. శిక్షణ పొందిన వారికి ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందించి అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ