తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ నెల 11న భద్రాచలం గోదావరి నది హారతి కార్యక్రమం,ఏరు – ది రివర్ ఫెస్టివల్‌లో భాగంగా భద్రాచలంలో గోదావరి నది హారతి కార్యక్రమం ప్రారంభమై కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజలు, భక్తులు, పండితుల నుంచి వచ్చిన సూచనలు, విన్నపాలు మరియు సలహాలను పరిగణలోకి తీసుకొని, గత వారం ముందుగానే ప్రకటించినట్లుగా ఈ వారం నుంచి ప్రతి ఆదివారం నది హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.గత రెండు శనివారాలలో భద్రాచలం గోదావరి ఘాట్ వద్ద నిర్వహించిన నది హారతి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. ప్రజల సౌకర్యం, స్థానిక సంప్రదాయాల పరిరక్షణ, అలాగే కార్యక్రమానికి మరింత విస్తృత భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో గోదావరి నది హారతి కార్యక్రమాన్ని ఇకపై ప్రతి ఆదివారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గోదావరి నది ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, నది పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని గోదావరి నది సంరక్షణకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ