Wednesday, 04 November 2026 11:57:43 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

వెదురు సాగు పై అవగాహన కల్పించాలి : సెర్ప్ ఫార్మా డైరెక్టర్ రజిత.

Date : 19 April 2025 07:29 PM Views : 530

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో వెదురు సాగుపై రైతులకు అవగాహన కల్పించి, వెదురు సాగు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సెర్ప్ ఫార్మా డైరెక్టర్ రజిత అన్నారు. శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో జిల్లాలోని ఉమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సీఈవోలు, జిల్లా సమాఖ్య సభ్యులు మరియు ఏపీఎం లతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి సెర్ప్ ఫార్మా డైరెక్టర్ రజిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జరిగిన మిర్చి కొనుగోలు వివరాలను డైరెక్టర్ రజిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎఫ్ పీసీల ద్వారా ఇప్పటివరకు సుమారు ఒక కోటి రూపాయల టర్నోవర్ చేశారని ఇంకా టర్నోవర్ పెంచాలని అధికారులకు సూచించారు. గుండాల ములకలపల్లి మరియు చండ్రుగొండ మండలంలో వెదురు రైతులకు గుర్తింపు మరియు ఆన్లైన్ నందు డేటా ఎంట్రీ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రైతులకు వెదురు సాగు వల్ల కలిగే లాభాలు గురించి అవగాహన కల్పించాలని సూచించారు. సమీకృత వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పించాలని, నాచురల్ ఫార్మింగ్ సీఆర్పీల పనితీరు పై ఈ సమావేశంలో చర్చించారు. మునగ సాగు మరియు మునగాకుల సేకరణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎఫ్ పి సి కోఆర్డినేటర్ శ్రీనివాస్, టిపిఎం ఫార్మా వెంకయ్య మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :