Friday, 18 September 2026 12:55:12 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక సంఘాల సమావేశం.

Date : 05 July 2025 04:45 PM Views : 696

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జులై 9న తలపెట్టిన కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం కొత్తగూడెం లోని రైటర్ బస్తీ IFTU కార్యాలయం నందు ముఖ్య సమావేశం జి ఎల్ బి కే ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు,జిఎల్బి కేస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చారువాక, టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు కోటయ్య పాల్గొని ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా ఎంతో మంది అమరుల త్యాగంతో సాధించుకున్న 44 లేబర్ చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోఢ్ లు గా తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాల రాస్తున్నారని వారన్నారు ఈ దేశంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వo కనీస వేతనాలను అమలు చేయడం లేదని వారన్నారు. ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని వాటిని భర్తీ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారని వారు విమర్శించారు. పారిశ్రామిక రంగాలను జాతీయం చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నాయని వారన్నారు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను పర్మినెంట్ చేయాలని పెండింగ్లో ఉన్న 57 జీవోలని అమలు చేయాలని వారు అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కోసం మాత్రమే పనిచేస్తుందని కార్మిక వర్గం కోసం పనిచేసే విధంగా లేదని వారు అన్నారు అందులో భాగంగానే ఖనిజ సంపద ఉన్న దగ్గర ఆయా రాష్ట్రాల పర్మిషన్లు లేకుండానే కార్పొరేట్ శక్తులైన ఆదాని అంబానీలకు తాకట్టు పెడుతున్నారని వారన్నారు. మరోపక్క రాష్ట్రాలకు ఉన్న హక్కులని కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వమే ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తుందని వారు విమర్శించారు ఈ సమస్యల పరిష్కారం కోసం జూలై 9న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను కార్మికులు కర్షకులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు గౌని నాగేశ్వరరావు జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ సంజీవ్ జిల్లా కోశాధికారి మోత్కూరి మల్లికార్జునరావు జిల్లా నాయకులు వాసు,వివిధ కార్మిక సంఘాల నాయకులు శ్రీను కృష్ణ శరత్ రామకృష్ణ రాజేష్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :