Sunday, 02 August 2026 07:00:18 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

పాల్వంచ పట్టణంలో నిర్వహించిన “99 డేస్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో పాల్గొన్న (DM&HO) డా. తుకారం రాథోడ్

Date : 03 April 2026 10:21 AM Views : 192

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) డా. తుకారం రాథోడ్ పాల్వంచ పట్టణంలోని పాత ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన “99 డేస్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం కింద గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సభలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి డా. తుకారం రాథోడ్ ప్రజారోగ్యంపై విస్తృత అవగాహన కల్పించారు. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను కచ్చితంగా పాటించడం అవసరమని తెలిపారు. అలాగే కాలానుగుణంగా వచ్చే జ్వరాలు, సంక్రమణ వ్యాధులు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అదేవిధంగా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణ, శుభ్రమైన తాగునీటి వినియోగం, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డా. టి. ప్రతాప్ , ప్రోగ్రాం ఆఫీసర్ (CHI), డా. దేవేందర్ రాజ్‌పుత్, మెడికల్ ఆఫీసర్, పీహెచ్‌సీ ఉల్వనూరు మరియు సంబంధిత ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ గ్రామ సభ కార్యక్రమం ప్రజల సక్రియ భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ముఖ్యమైన ఆరోగ్య సందేశాలు చేరవేయబడినవి.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :