Friday, 18 September 2026 09:43:46 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

బంజారా సంఘాల జేఏసీ చైర్మన్‌గా వీరూనాయక్‌ రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక. ‘గూడెం’లో బంజారా భవన్‌ నిర్మాణానికి కృషి: మేయర్‌ గణేష్‌ నాయక్‌.

Date : 03 July 2026 08:14 PM Views : 234

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతి ఐక్యతే ఏకైక లక్ష్యం. సేవాలాల్‌ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్‌ నాయక్‌. కార్పొరేషన్‌ మేయర్, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లకు ఘన సన్మానం.‘గూడెం’లో బంజారా భవన్‌ నిర్మాణానికి కృషి: మేయర్‌ గణేష్‌ నాయక్‌. మార్కెట్‌ కమిటీ ద్వారా రైతులకు పూర్తి న్యాయం చేస్తాం: చైర్మన్‌ లాల్‌సింగ్‌. హక్కుల కోసం ఐక్యంగా పోరాడుదాం: సేవాలాల్‌ సేన రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్‌ నాయక్‌.బంజారా సంఘాల జేఏసీ చైర్మన్‌గా వీరూనాయక్‌ రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక.బంజారా జాతి ఐక్యత కోసం ప్రతి ఒక్కరు కలిసి రావాలని, ఐక్యత ద్వారానే హక్కులు సాధించుకోవచ్చునని సేవాలాల్‌ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్‌ నాయక్‌ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంజారా సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ శంకర్‌ నాయక్, వైస్‌ చైర్మన్‌ బానోత్‌ వీరు నాయక్‌ల ఆధ్వర్యంలో సభాధ్యక్షులుగా టీఎస్‌టీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్‌ రాములు నాయక్, గ్రీన్‌ ఎర్త్‌ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య రమేష్‌ రాథోడ్‌లు వ్యవహరించగా, జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌లో గురువారం రాత్రి కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ మూడ్‌ గణేష్‌ నాయక్, కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బానోత్‌ లాల్‌సింగ్, వైస్‌ చైర్మన్‌ భూక్య జనార్ధన్‌ మరియు డైరెక్టర్లు అజ్మీరా అమ్రు, మాళోత్‌ అశోక్‌ బాబు, సపావట్‌ రవి, బానోత్‌ రవి, తేజావత్‌ రవికుమార్, ఇస్లావత్‌ హరిలాల్, తేజావత్‌ శివలకు శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు, మెమొంటోలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సంజీవ్‌ నాయక్‌ మాట్లాడుతూ విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో బంజారాల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. జాతి మనుగడకోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, సంఘటిత, అసంఘటితరంగ కార్మికులు, ఉద్యోగులంతా కలిసి రావాలని కోరారు. బంజారాలకు దక్కాల్సిన పథకాలు, హక్కులను పోరాడి సాధించుకుందామన్నారు.‘గూడెం’లో బంజారా భవన్‌ నిర్మాణానికి కృషి: మేయర్‌ గణేష్‌ నాయక్‌ కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మూడ్‌ గణేష్‌ నాయక్‌ మాట్లాడుతూ గిరిజన జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బంజారాలకు ఎలాంటి కమ్యూనిటీ భవనాలు లేవని, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో బంజారా భవన్‌ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని, త్వరితగతిన ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు చేపడతానన్నారు. బంజారాలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. గతంలో తనకు సేవాలాల్‌ సేనలో సంఘ బాధ్యుడిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌ తొలి మేయర్‌గా బంజారా జాతికి చెందిన తనను నియమించడం పట్ల ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్‌పాషాలకు కృతజ్ఞతలు తెలిపారు.మార్కెట్‌ కమిటీ ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాం: చైర్మన్‌ లాల్‌సింగ్‌ కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బానోత్‌ లాల్‌సింగ్‌ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా నిర్వీర్య దశలో ఉన్న కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి మళ్లీ పునర్జీవం అందిస్తామని అన్నారు. కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, చుంచుపల్లి, పాల్వంచ, చండ్రుగొండ ప్రాంతాల రైతులకు మార్కెట్‌ కమిటీ ద్వారా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతోపాటు అన్ని రకాల పంటలు నిత్యం ఇక్కడ కొనుగోలు చేసే విధంగా కృషి చేస్తానని చెప్పారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా నన్ను నియమించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ పార్టీలో ఉన్నా బంజారాలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.హక్కుల కోసం ఐక్యంగా పోరాడుదాం: సేవాలాల్‌ సేన రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్‌ నాయక్‌ బంజారాల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడుదామని సేవాలాల్‌ సేన రాష్ట్ర అధ్యక్షులు బానోత్‌ హుస్సేన్‌ నాయక్‌ పిలుపునిచ్చారు. ఇలాంటి సంఘటిత కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి బంజారాల ఐక్యతను చాటిచెప్పాలని అన్నారు. బంజారాలపై చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని కోరారు. బంజారాలు ఏ స్థాయిలో ఉన్నా వారి అభ్యున్నతి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పారు.బంజారాల మూలాలను కాపాడుకోవాలి: డాక్టర్‌ శంకర్‌ నాయక్, జేఏసీ చైర్మన్‌ బంజారాల మూలాలు, ఆచారాలు, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బంజారా సంఘాల జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ శంకర్‌ నాయక్‌ ఉద్ఘాటించారు. భవిష్యత్తు తరాలకు మన సాంప్రదాయాలను తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రస్తుత తరాలపై ఉందని అన్నారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి అనేక మంది తమ ఆచార వ్యవహారాలను దూరం చేసుకుంటున్నారని, ఇది ఎంతో బాధాకరమైన విషయమన్నారు. ఇలా ఆచార వ్యవహారాలను దూరం చేసుకుంటే బంజారాల మనుగడ కష్టసాధ్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు తనను చైర్మన్‌గా ఆదరించిన ఆదరించిన బంజారా సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.జేఏసీ చైర్మన్‌గా బానోత్‌ వీరు నాయక్‌ రెండవసారి ఏకగ్రీవ ఎన్నిక ఈ సందర్భంగా బంజారా సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఇప్పటివరకు వైస్‌ చైర్మన్‌గా పనిచేసిన బానోత్‌ వీరు నాయక్‌ను మరోసారి చైర్మన్‌గా ఎన్నుకుంటూ ప్రస్తుత చైర్మన్‌ డాక్టర్‌ శంకర్‌ నాయక్‌ ప్రతిపాదించగా, సంఘాల నాయకులు ఆమోదించారు. గతంలోనూ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం వీరునాయక్‌కు ఉంది. ఈ సందర్భంగా వీరూనాయక్‌ మాట్లాడుతూ బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అందరినీ కలుపుకునిపోతూ పోరాటాలు చేస్తానని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతోపాటు అన్ని పార్టీల్లోని బంజారా నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి బంజారాల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కార్యదర్శులు ధరావత్‌ కన్షీరామ్, అజ్మీరా శంకర్, గుగులోత్‌ శంకర్, ట్రెజరర్‌ బానోత్‌ రమేష్, బిజెపి జిల్లా సెక్రెటరీ బోడ పుణ్య నాయక్ టిఎస్‌టిటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి సపావట్‌ బాలకృష్ణ, భూక్య బాబులాల్, సేవాలాల్‌ సేన జిల్లా అధ్యక్షుడు మాళోత్‌ శివ, సేవాలాల్ బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు గుగులోత్ బద్రు నాయక్.బంజారా పూజారుల సంఘం జిల్లా అధ్యక్షులు బానోత్‌ గణేష్, సేవాలాల్‌ సేన మహిళా నాయకురాళ్లు భూక్య రుక్మిణి, భట్టు మంజుల, ఘంసీ, యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు మాళోత్‌ రాజా, యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు జర్పుల బాలు, పీఆర్‌టీయూ జిల్లా అసోసియేట్‌ అధ్యక్షులు. మున్సిపల్ కార్పొరేషన్ ఇన్స్పెక్టర్ అశోక్ చౌహన్. మాజీ ఎంపీటీసీ గోవింద్. సిపిఐ పార్టీ నాయకులు ఉపేందర్. ప్రసాద్, సేవాలాల్‌ సేన జిల్లా నాయకులు. గుగులోత్ చందర్. భట్టు హుస్సేన్, ధరావత్‌ కృష్ణ, సేవలాల్ సేన యువసేన జిల్లా అధ్యక్షులు బానోత్ భరత్. సేవిలాల్ సేన పాల్వంచ మండల అధ్యక్షులు. జరుపుల పరమేష్.. పిసా చట్టం మొబిలైజర్ ఇస్లావత్ లాలు. యువసేన అధ్యక్షులు కుమార్ నాయక్ రాజా సురేష్. చుంచుపల్లి సర్పంచ్‌ భూక్య వీరన్న, మాజీ సర్పంచ్‌ రాంచంద్రు, జేఏసీ కో కన్వీనర్లు ఇస్లావత్ సాంబశివ నాయక్. జాటోత్‌ భరత్, లావుడ్య హన్మంతు, భూక్య శివ, ధరావత్‌ రవి, మురళి, బాలు నాయక్.సోషల్ మీడియా ఆర్గనైజర్ వినోద్. నరసింహ. సింగరేణి సంఘ నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు, గిరిజన సంఘ నాయకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :