Wednesday, 16 September 2026 09:53:19 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

కొత్తగూడెం ఏరియా నూతన జీఎం వెంకటరమణకు ఎఐటీయూసీ అగ్ర నాయకత్వం శుభాకాంక్షలు.

Date : 04 August 2026 07:30 PM Views : 629

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరమణను గుర్తింపు కార్మిక సంఘం ఎఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమీ రాజ్‌కుమార్‌లు మంగళవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఎఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ అభివృద్ధి, ఉత్పత్తి–ఉత్పాదకత పెంపు, కార్మికుల సంక్షేమం అనే మూడు అంశాలను సమన్వయం చేస్తూ తమ సంఘం దశాబ్దాలుగా నిరంతర ఉద్యమాలు, పోరాటాలు, యాజమాన్యంతో నిర్మాణాత్మక చర్చల ద్వారా అనేక సమస్యలకు పరిష్కారాలు సాధించిందని తెలిపారు. కొత్తగూడెం ఏరియాను ఉత్పత్తి, ఉత్పాదకతలో అగ్రస్థానంలో నిలిపే సమర్థ అధికారిగా వెంకటరమణ రాణించాలని ఆకాంక్షించారు.అలాగే కార్మికుల సంక్షేమం, భద్రత, ఆరోగ్యం, సంక్షేమ పథకాల అమలుకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఏరియాలో కార్మికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం, కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారంలో యాజమాన్యం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శులు సారయ్య, ముస్కే సమ్మయ్య, మడ్డి ఎల్లగౌడ్, వై.వి.రావు, కందికట్ల వీరభద్రయ్య, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, ఉపాధ్యక్షుడు కత్తర్ల రాములు, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బేరర్ సందబోయిన శ్రీనివాస్, పిట్ కార్యదర్శులు మధుకృష్ణ, కమల్, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :