తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జిఎం షాలెం రాజు నీ కలిసి పలు కార్మిక సమస్యల పై మెమొరాండం ఇచ్చారు,ముఖ్యంగా మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన కార్మికుల వారసులకు సుమారు 42మందికి మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి అయి 5 నెలలు గడుస్తున్న వారి వారసులకు ఇంకా నియామక ప్రక్రియను పూర్తి చెయ్యలేదు అని అన్నారు దాని వల్ల 42 కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు అదేవిధంగా వారు ఉద్యోగాల ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారని వారికి వీలైనంత త్వరగా ఉద్యోగ నియామక పత్రాలను అందించాలని డిమాండ్ చేశారు మరియు చిన్న చిన్న కారణాలతో నియామక ప్రక్రియ పూర్తికాని అభ్యర్థులకు కూడా వారి నెలల తరబడి కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉన్నందున వారికి కూడా వీలైనంత త్వరగా న్యాయం చేసి నియామక పత్రాలు అందించాలని కోరుతూ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కు గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు మెమొరాండం అందించారు,సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చూస్తాను అని జిఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు, సహాయ కార్యదర్శి గట్టయ్య,సత్తుపల్లి కార్యదర్శి సముద్రాల సుధాకర్, సివిల్ పిట్ కార్యదర్శి శ్రీనివాస్, వర్క్ షాప్ పిట్ కార్యదర్శి మధు కృష్ణ,జిఎం కార్యాలయం పిట్ కార్యదర్శి సౌజన్య మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ