తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 15 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలంవెంగన్న పాలెం గ్రామంలో ట్రాలీలో రేషన్ బియ్యంన్ని తరలిస్తుండగా నమ్మదగిన సమాచారంపై సివిల్ సప్లై అధికారులు వెంబడించగా గ్రామంలో ఓ కోళ్ల ఫారం దగ్గర నిలువ చేస్తూ పట్టుబడినట్లు సివిల్ సప్లై రెవిన్యూ ఇన్స్పెక్టర్ నెక్కిలి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి పట్టుకున్న రేషన్ బియ్యాన్ని గోడౌన్ కి తరలించి.రెండు వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. రేషన్ బియ్యం వ్యాపారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు
Admin
తెలుగు వెలుగు టీవీ