తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం తాహసిల్దార్ కార్యాలయంలో హియరింగ్ సరళిని, ఓటర్ల ధ్రువపత్రాలు పరిశీలించి నేరుగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఓటర్ల దృవపత్రాలు సక్రమంగా ఉండేలా ఏ.ఈ.ఆర్.ఓ,బి.ఎల్.ఓ లు చూసుకోవాలి పీ.ఎంశ్రీ కొత్తగూడెం కూలీలైట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సందర్శించి పాఠ్యాంశాల్లో విద్యార్థుల ప్రావీణ్యం పరిశీలించిన జిల్లా కలెక్టర్ వంటసాల తనిఖీ చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందించాలి ప్రజారోగ్య కార్యక్రమాలు సకాలంలో రోగులకు అందించాలి పాల్వంచ ఏరియా ఆసుపత్రి ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వ వైద్యం పై భరోసా కల్పించేలా సేవలు విస్తృతం చేయాలి.. వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ "సర్" ప్రక్రియలో ఓటు కోల్పోయిన ఓటర్లకు నోటీసులు స్వీకరిస్తున్న హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.శుక్రవారం కొత్తగూడెం తాహసిల్దార్ కార్యాలయంను ఆకస్మికంగా సందర్శించి హియరింగ్ ప్రక్రియను క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటు కోల్పోయిన వారికి బి.ఎల్.ఓలు నేరుగా అందజేసిన నోటీసులకు సరైన ధ్రువపత్రాలను తాహసిల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చిన అర్హులైన ఓటర్లతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడారు. నోటీసులు ఇంటికి ఎవరు తీసుకొచ్చారని.. ఎన్ని రోజుల క్రితం నోటీసులు మీకు అందాయని ఓటర్లతో మాట్లాడారు. సరైన ధ్రువపత్రాలు పత్రాలు తీసుకు వచ్చామని ఓటర్లు కలెక్టర్ కు సమాధానం చెప్పగా, ఆ పత్రాలను స్వయంగా పరిశీలించి బి.ఎల్.ఓ లకు అందజేసి తక్షణమే ఆన్లైన్ ప్రక్రియ సక్రమంగా.. పకడ్బందీగా పొరపాట్లు దొర్లకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓటర్ల దృవపత్రాలు సక్రమంగా ఉండేలా ఏ.ఈ.ఆర్.ఓ,బి.ఎల్.ఓ లు చూసుకోవాలని తెలిపారు.
ప్రతిష్టాత్మకంగా ఎంపిక చేసిన కొత్తగూడెం మండలంలోని పీఎంశ్రీ పథకంలో కొనసాగుతున్న కూలీలైన్ ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ సందర్శించారు. పాఠశాలలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తుండగా ఆరవ తరగతిలో ఇంగ్లీష్ సబ్జెక్టు పై పాఠ్యాంశాల్లో ప్రావీణ్యం ఏ విధంగా ఉంది అని విద్యార్థులతో చదివించి క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రణాళిక బద్ధంగా క్రమశిక్షణతో విద్యార్థులకు విద్యాబోధన చేయాలని ఇంగ్లీష్ తోపాటు అన్నీ సబ్జెక్టులల్లో రాణిచేలా కృషి చేయాలని ఉపాధ్యాయుడు హరిబాబుకు సూచించారు. అనంతరం పాఠశాలలో ఉన్న వంటశాలను పరిశీలించి 160 మంది విద్యార్థులకు వండిన ఆహార పదార్థాలు కూర, పప్పు, అన్నం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న పథకంలో పౌష్టికాహారం అందిస్తుందని అవి విద్యార్థులకు అందేలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లాలు రాథోడ్ చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలకు త్రాగునీరు వసతులు ఏమున్నాయని ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ తో పాటు బయటనుంచి మినరల్ వాటర్ విద్యార్థుల త్రాగునీరు కోసం అందుబాటులో ఉంచామని జిల్లా కలెక్టర్ కు తెలిపారు. అదేవిధంగా పాల్వంచ ఏరియా ఆసుపత్రి ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య కార్యక్రమాలు సకాలంలో రోగులకు అందించాలని, అందిస్తున్న వైద్య సేవలను ఆసుపత్రి సూపరిడెంటెంట్ డాక్టర్ ముక్కటేశ్వరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న మెయిల్ వార్డు, ఫిమేల్ వార్డు ఎమర్జెన్సీ వార్డు, క్యాజువాలిటీ, డయాలసిస్ సెంటర్, బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఆపరేషన్ థియేటర్ లను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా ఐపీ విభాగంలో రికార్డులను పరిశీలించి ఈ రోజు ఎన్ని జ్వరాల కేసులు నమోదయాయని అడిగి తెలుసుకున్నారు. 17 జ్వరాలు నమోదైన రోగులకు అడ్మిట్ చేసుకొని చికిత్స అందిస్తున్నటట్లు జిల్లా కలెక్టర్ కు సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ ఆసుపత్రి ఆర్ఎంఓ సోమరాజు దొర, రెవెన్యూ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ