తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి భాధ్యత అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యుడు చెప్యాల రాజేశ్వర్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం భద్రాచలం దర్శన నిమిత్తం వచ్చిన ఆయన లక్ష్మిదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి గ్రామంలోని బీ ఆర్ ఎస్ వీ రాష్ట్ర నాయకుడు సంగం శివ గృహంలో తేనీరు సేవించి , మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , గ్రీన్ ఇండియా చాలెంజ్ కన్వీనర్ , మాజీ రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మొక్కలను నాటడం ఒక యజ్ఞం లాగా చేపట్టామని తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్చమైన వాతావరణాన్ని అందించడం, పర్యావరణ పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ వీ నాయకులు భద్రం శ్రీరామ్, నిరంజన్, రవి, నరేష్, ప్రవీణ్, వంశీ , తరుణ్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ