Wednesday, 16 September 2026 06:00:17 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

స్పష్టమైన ప్రణాళికతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలి. జిల్లా విద్యాశాఖ అధికారి బి. నాగలక్ష్మి.

Date : 21 April 2026 06:53 PM Views : 212

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ విద్యా సంవత్సరం జరిగిన ప్రగతిని సమీక్షించుకొని స్పష్టమైన ప్రణాళికతో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి. నాగలక్ష్మి అన్నారు. జిల్లా విద్యాశాఖ మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు తో ఈరోజు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన సంవత్సరాంత సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ప్రాథమిక స్థాయిలో ఎఫ్ ఎల్ ఎన్ మరియు ఉన్నత స్థాయిలో అభ్యసన అభివృద్ధి కార్యక్రమం లో జరిగిన ప్రగతిని మరియు లోటుపాట్లను సమీక్షించుకొని వచ్చే విద్యా సంవత్సరం ఉన్నతమైన ఫలితాలు సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. విద్యాశాఖలో జరిగే వివిధ కార్యక్రమాలైన పాఠశాల వారి విద్యార్థుల నమోదు, మూతబడిన పాఠశాలను తిరిగి తెరిపించడం, అదేవిధంగా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి నమోదులో మార్పు, పిల్లల ఆధార్ మరియు అపార్ పరిస్థితి, ప్రతి పాఠశాల యొక్క మౌలిక వసతుల లభ్యత మొదలగు అంశాలపై ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ వచ్చే విద్యా సంవత్సరానికి ఎటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకుని పని చేయాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. అదేవిధంగా పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న మరమ్మతులు మరియు నిర్మాణ పనులపై కూడా ఆయా ఇంజనీరింగ్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులతో కలిపి సమీక్ష చేశారు. ఈ సంవత్సరం ప్రాథమిక స్థాయిలో ఎఫ్ ఎల్ ఎన్ మరియు ఉన్నత స్థాయిలో అభ్యసన అభివృద్ధి కార్యక్రమం, మండల విద్యాశాఖ అధికారులు మరియు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాలలను సందర్శించిన వివరాలు మొదలగు వాటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి చూపించి ఈ సంవత్సరం ఫలితాలను బేరీజు వేసుకొని వచ్చే సంవత్సరం 100% ఫలితాలు సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. పిల్లలు వేసవి సెలవులలో అభ్యసన ప్రక్రియకు దూరం కాకుండా ఉండటానికి వారికి 45 రోజులు పాటు ఎటువంటి రాత పనిని ఇవ్వాలో దిశా నిర్దేశం చేస్తూ పిల్లలందరూ ఈ రాత పనిలో నిమగ్నం అయ్యే విధముగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, దానికై ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని విద్యార్థుల్లో అభ్యసన లోపం లేకుండా చూడాలని కోరారు. వివిధ మండలాల్లో భవిత భవనాల నిర్మాణం లో జరుగుతున్న జాప్యాన్ని నివారించి పాఠశాలలు పునః ప్రారంభం నాటికి పిల్లలకి అందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ ఎస్ కే సైదులు, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్, బాలిక విద్యా కోఆర్డినేటర్ జే. అన్నామని, జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :