తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ మండలం జగన్నాధపురంలో కొలువైన శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయంలో ఆలయ అర్చకులు గురువారం ప్రత్యేక పూజలు జరిపారు. 108 పుష్పాలతో అమ్మవారికి సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు. ఆలయ ఈవో రజిని కుమారి ఆదేశాల మేరకు అమ్మవారికి హారతి, మంత్రపుష్పం నివేదన తదితర పూజలు జరిపారు. కార్తీకమాస ఉత్సవం సందర్భంగా శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకం లక్ష బిల్వార్చన, హారతి నివేదన పూజలు చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ