తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : )జూలూరుపాడు మండల కేంద్రంలో ఆర్ఎంపీ ప్రధమ చికిత్స సెంటర్లపై వైద్య ఆరోగ్య శాఖ భద్రాచలం అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ సైదులు ఆకస్మిక దాడులు నిర్వహించారు, ఆర్ఎంపి క్లినిక్స్ లను పరిశీలిస్తుండగా కొందరు ఆర్ఎంపీలు సమాచారం తెలుసుకొని క్లినిక్ లో లేకుండా వెళ్ళిపోయిన సంఘటన చోటుచేసుకుంది, ఈ సందర్భంగా డాక్టర్ సైదులు మాట్లాడుతూ ఆర్ఎంపీ క్లినిక్లను పరిశీలించడం జరిగిందని తెలిపారు, జూలూరుపాడు లో ఆర్ఎంపీల వద్దకు వచ్చే రోగులకు అత్యధిక యాంటిబయాటిక్స్ వాడుతున్నారని మా దృష్టికి వచ్చిందని తెలిపారు, ఆర్ఎంపీలు ప్రధమ చికిత్స మాత్రమే చేయాలని పరిమితికి మించి వైద్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ తేజస్విని, సిహెచ్ఓ రామకృష్ణ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ