తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేవిధంగా కృషి చేయడం ద్వారా పార్టీ విస్తరణకు నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలనీ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. పట్టణంలోని రామవరం సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కార్మికవర్గానికి, పేదప్రజలకు అనునిత్యం సేవలందించేది కమ్యూనిస్టు పార్టీ, ఏఐటీయూసీనేనని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐకి ఎదురులేదని, ప్రజలకు అందించిన సేవల ఫలితంగాలో రోజురోజుకు జనాదరణ పెరుగుతుందని అన్నారు. కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని, ఎమ్మెల్యే కూనంనేని కృషితో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో నాయకులు కంచర్ల జమలయ్య, జి వీరాస్వామి, మునిగడప వెంకటేశ్వర్లు, భూక్యా శ్రీను, ఎస్ కె ఫహీమ్, పాటి మోహన్, మాతంగి లింగయ్య, మాటేటి గోపాల్, దెబ్బడ గురుమూర్తి, మర్రిగోపి కృష్ణ,తూముల శ్రీనివాస్, బరిగెల భూపేష్, గుత్తుల శ్రీనివాస్, మండల రాజు, కొరిమి సురేష్, ఎస్.కె ఖయూమ్, గుగులోత్ నగేష్, ఎండి.అంకూస్, సింగిరాల రమేష్, దాసు, జలీల్, మజ్జిగ రణధీర్, మర్రి కృష్ణ, విజయలక్ష్మి, దార లక్ష్మి, ఎర్రబెల్లి శంకర్, దాట్ల శ్రవణ్, కొయ్యడ వెంకన్న, సామర్ల సమ్మయ్య, అల్ల కొండ సాయిలు, గోపి, బానోత్ శ్రీనివాస్, ఎస్.కె రసూల్,అలీం, అనీఫ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ