Sunday, 02 August 2026 04:55:09 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

సింగరేణి ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

Date : 24 July 2026 05:46 PM Views : 86

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్త బొగ్గు బ్లాకుల సాధనకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, మణుగూరు ప్రకాశ్ ఖని ఓపెన్‌కాస్ట్ గనిని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ టౌన్‌షిప్‌లో డి.ఏ.వి. పాఠశాల ప్రారంభం రాష్ట్ర విద్యుత్ రంగానికి సింగరేణి వెన్నెముక... సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించి విద్యుత్ ఉత్పత్తి కార్యకలాపాలను పరిశీలించిన అనంతరం, మణుగూరు ప్రకాశ్ ఖని (పీకే ఓసీ) ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిని క్షేత్రస్థాయిలో సందర్శించి గని పనితీరు, బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, సంస్థ భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ అంకిత్, ఇల్లందు శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, ఎస్‌సీసీఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఐఏఎస్, టీఎస్‌జెన్‌కో ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ హరీష్, ఐఏఎస్, ఎస్‌సీసీఎల్ డైరెక్టర్ (పర్సనల్, అడ్మినిస్ట్రేషన్ & వెల్ఫేర్) గౌతమ్ పొట్రూ తదితరులు పాల్గొన్నారు. ముందుగా భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ, బొగ్గు వినియోగం, యంత్రాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ వ్యవస్థలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సెంట్రల్ కంట్రోల్ యూనిట్‌ను సందర్శించి విద్యుత్ ఉత్పత్తి, నియంత్రణ వ్యవస్థల పనితీరును పరిశీలించారు. ప్లాంట్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు చేపడుతున్న చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, నిర్వహణలో అనుసరిస్తున్న విధానాలపై అధికారులతో చర్చించారు. అనంతరం భద్రాద్రి పవర్ ప్లాంట్ టౌన్‌షిప్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన డి.ఏ.వి. పాఠశాలను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి ఉద్యోగుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించే దిశగా చేపట్టిన చర్యలను అభినందించారు. తదనంతరం మణుగూరు ప్రకాశ్ ఖని (పీకే ఓసీ) ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి గనిలో జరుగుతున్న తవ్వకాల ప్రక్రియ, బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, యంత్రాల పనితీరు, భద్రతా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 1976లో ప్రారంభమైన ఈ గని చరిత్ర, ఇప్పటివరకు జరిగిన బొగ్గు ఉత్పత్తి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలు, గని జీవితకాలం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గనిలోకి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి బొగ్గును స్వయంగా చేతిలోకి తీసుకుని దాని నాణ్యతను పరిశీలించారు. రాష్ట్ర విద్యుత్ రంగానికి సింగరేణి వెన్నెముకలాంటి సంస్థ అని పేర్కొంటూ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బొగ్గు నిల్వల పెంపు, ఉత్పత్తి విస్తరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

రాబోయే రోజుల్లో కొత్త బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించి నిర్వహించే వేలం ప్రక్రియలో సింగరేణి సంస్థ చురుగ్గా పాల్గొని కొత్త బొగ్గు బ్లాకులను సొంతం చేసుకునేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. పోటీ ప్రపంచంలో సింగరేణి తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ దేశంలోనే అగ్రగామి బొగ్గు సంస్థగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, తాడిచెర్ల బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించడంతో సంస్థ వ్యాప్తంగా అధికారులు, ఉద్యోగులు, కార్మికుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయని ఉప ముఖ్యమంత్రికి వివరించారు. అదేవిధంగా, సంస్థ భవిష్యత్ ఉత్పత్తి అవసరాలు, దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పీకే ఓసీ డిప్ సైడ్ బ్లాక్‌ను కూడా సింగరేణికే కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, సింగరేణి ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యుత్ రంగ అవసరాలను తీర్చడంలో, పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వడంలో, వేలాది మంది కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించడంలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధి, విస్తరణ, కొత్త బొగ్గు బ్లాకుల సాధన, ఉద్యోగుల సంక్షేమం, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు వంటి అన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. సింగరేణి భవిష్యత్ ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతుందని అధికారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి, టీఎస్‌జెన్‌కో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :